ఉద్యమం: ఫాంహౌస్‌లో పవన్ కళ్యాణ్ (ఫోటోస్)
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ మధ్య ప్రకృతి ఉద్యమం చేపట్టిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ వృత్తి సినిమాల్లో నటించడం అయితే...ఆయన ప్రవృత్తుల్లో వ్యవసాయం ఒకటి. ఏ మాత్ర సమయం దొరికినా హైదరాబాద్ సమీపంలో ఆయన ఫార్మ్ హౌస్ లో గడపడటం ఆయనకు అలవాటు. అక్కడ రకరకాల పండ్లు, కూరగాయలు సాగు చేస్తున్నారు.
ప్రస్తుత కాలంలో రసాయనాలతో కూడిన వ్యవసాయమే ఎక్కువగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రకృతి ఉద్యమాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. విజయరామ్ అనే వ్యక్తితో కలిసి ఆయన ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. రసాయన సేద్యాన్ని విడిచి ప్రకృతి సేద్యం వైపు రైతులను ప్రోత్సహించడానికి విజయరామ్ తో కలిసి పవన్ కళ్యాణ్ తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.
విజయరామ్ సహకారంతో తన ఎనిమిది ఎకరాల సొంత వ్యవసాయ క్షేత్రంలో అన్ని రకాల ఆకు కూరలు, పండ్లు, పూల మొక్కల సాగు ప్రారంభించారు పవన్ కళ్యాణ్. రసాయనాల అవసరం లేని గోఆధారిత సాగు వ్యవసాయం దగ్గరుండి పరిశీలిస్తున్నారు పవన్ కళ్యాణ్. పంట పండిన తర్వాత ఆ రుచులను పవన్ కళ్యాణ్ ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. ఈ పద్దతిలో పండిన ఆకుకూరలు చిన్న తనంలో నాయనమ్మ వండిపెట్టినపుడు ఎంత రుచిగా ఉన్నాయో అంతే రుచిగా ఉన్నాయని అంటున్నారు పవన్.
రైతు కన్నీరు పెట్టని గ్రామీణ భారతం రావాలనేది పవన్ కళ్యాణ్ ఆకాంక్ష . స్లైడ్ షోలో మరిన్ని వివరాలు.

జీరో బడ్జెట్ వ్యవసాయం
విజయరామ్ తో కలిసి జీరో బడ్జెట్ వ్యవసాయం పద్దతలను పవన్ కళ్యాణ్ ఫాం హౌస్ లో ప్రారంభించారు.

జీవామృతం
సహజ సిద్దమైన పద్దతిలో మొక్కలకు అవసరమైన జీవామృతం నేలపై చల్లుతున్న పవన్ కళ్యాణ్.

సుభా పాలెకర్ మెథడ్
సుభా పాలెకర్ జీరో బడ్జెట్ వ్యవసాయం పద్దతిలో పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు.

కూరగాయలు పరిశీలిస్తూ
జీరో బడ్జెట్ సాగు పద్దతిలో పండించిన కూరగాయలను పరిశీలిస్తున్న పవన్ కళ్యాణ్.

రైతులు కన్నీరు పెట్టని గ్రామీణ భారతం
రైతులు కన్నీరు పెట్టని గ్రామీణ భారతం రావాలని ఆశిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ ఆ సంక్రాంతి సందర్బంగా వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











