తమన్ క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్.. ఖుషిలో ఆ సాంగ్.. పవన్ కళ్యాణ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు పక్కన పెట్టి పూర్తిగా రాజకీయాల్లో లీనమైపోయారు. ఆంధ్రప్రదేశ్ వ్యక్తంగా రాజకీయ కార్యక్రమాలతో పవన్ బిజీగా గడుపుతున్నాడు. అక్టోబర్ 15 పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తలతో భారీ కవాతు కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ పై జరిగే కార్యక్రమానికి సంబందించిన పవన్ ఆసక్తికర విషయాలు తెలియజేశారు.
కవాతు కార్యక్రమం కోసం ఓ ప్రత్యేకమైన సాంగ్ రూపొందించాం. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. క్రియేటివ్, బ్రిలియంట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ పాటని కంపోస్ చేశారని పవన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. 2001లో విడుదలైన తన చిత్రం ఖుషిలోని ఏమేరా జహా పాట కంపోజిషన్ లో తమన్ కీలక పాత్ర పోషించాడని పవన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

రామజోయయ్య శాస్త్రి గారు కవాతు కార్యక్రమం ఉద్దేశం ప్రతిభింబించేలా సాహిత్యం అందించారని పవన్ ప్రశంసించారు. అరవింద సమేత చిత్రం ఘనవిజయంతో తమన్ మంచి జోరుమీద ఉన్నాడు. అరవింద సమేత చిత్రానికి తమన్ అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ సంగీతానికి అద్భుతమైన స్పందన వస్తోంది.


Click it and Unblock the Notifications











