మెగా బ్రదర్స్, సిస్టర్స్ రేర్ ఫోటో.. పవన్ కల్యాణ్ ట్వీట్ చేసి ఏమన్నారంటే..
మెగా ఫ్యామిలీలో సభ్యులందరూ అన్యోన్యంగా ఉంటారని సినీ వర్గాలు చెప్పుకొంటాయి. అందరూ అనుకొనే విధంగానే మెగా ఫ్యామిలీలో ఐక్యత కనిపిస్తుంది. హీరోలమనే అహంభావం వారిలో కనిపించదు. మధ్య తరగతి కుటుంబం మాదిరిగానే వారి తీరు అభిమానులను, సన్నిహితులను ఆకట్టుకొంటుంది. అలాంటి విషయాన్ని తెలిపే విధంగా... కుటుంబంలోని అన్యోన్యతను చాటిచెప్పే ఒక ఫొటోను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

ఈ ఫొటోలో ఉన్నది నా సోదరులు, సోదరీమణులు. నెల్లూరులో ఈ ఫొటో తీసుకొన్నప్పుడు నేను ఏడో తరగతి చదువుతున్నాను. ఉబ్బసం వ్యాధి నుంచి నేను తేరుకొన్న తర్వాత నా అన్నలు, అక్కయ్య, చెల్లెలతో తీసుకొన్న ఫొటో ఇది అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
pawan kalyan chiranjeevi nagababu tollywood konidela family పవన్ కల్యాణ్ చిరంజీవి నాగబాబు టాలీవుడ్ కొణిదెల ఫ్యామిలీ


Click it and Unblock the Notifications