»   » పవన్ కళ్యాణ్ జోరు: ఫ్యాన్స్‌తో పొలిటీషియన్స్ కూడా..

పవన్ కళ్యాణ్ జోరు: ఫ్యాన్స్‌తో పొలిటీషియన్స్ కూడా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మీడియాకు, సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యూ ఇయర్ సందర్భంగా అందరినీ ఆశ్చర్య పరుస్తూ ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఖాతా తెరవడమే ఆలస్యం...రికార్డుల మోత మోగింది. ట్విట్టర్లో ఆయన్ను ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య వేల నుండి లక్షలకు చేరింది.

ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ తన రాజకీయ పరమైన అభిప్రాయాలను, అంశాలను, తన పర్యటనల ట్విట్టర్లో ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్నారు. దీంతో ఆయన్ను ఫాలో అయ్యే వారి లిస్టులో అభిమానులతో పాటు పలు రాజకీయ నాయకులు కూడా చేరి పోయారు. దీంతో ఆయన ట్విట్టర్ అకౌంట్ ఫాలో అయ్యే వారి సంఖ్య 3 లక్షల(300k)కు చేరుకుంది. ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన 2 నెలల్లోనే ఈ రేంజిలో పాలోయింగ్ పెరగడం చర్చనీయాంశం అయింది.

Pawan Kalyan twitter followers 300k

పవన్ అకౌంట్ ఓపెన్ చేసిన ఫస్ట్‌డే అత్యధిక పాలోవర్స్ ను సొంతం చేసుకున్న ఇండియన్ సెలబ్రిటీల లిస్టులో పవన్ కళ్యాణ్ అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్లను బీట్ చేసిన పవన్ సెకండ్ ప్లేస్ సొంతం చేసుకున్నారు. ఆయన అకౌంట్ ఓపెన్ చేసిన 22 నిమిషాల్లోనే ఆయన్ను ఫాలో అయ్యే వారి సంఖ్య 4000 దాటింది. 12 గంటలు పూర్తయ్యేలోగా ఆ సంఖ్య కాస్తా 55 వేలు దాటింది. 24 గంటల్లో పవన్ కళ్యాణ్ ఖాతాను అనుసరించే వారి సంఖ్య 91వేలకు చేరుకుంది.

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయగా ఒక రోజు(24 గంటల్లో) 46 వేల పైచిలుకు ఫాలోవర్స్ అయ్యారు. అమితాబ్ బచ్చన్ 37,500 పై చిలుకు పాలోవర్స్ అయ్యారు. అయితే ఇప్పటి వరకు ఈ ఇద్దరు సెలబ్రిటీల 2, 3 స్థానాల్లో ఉన్నారు. తొలిస్థానంలో సౌతిండియా స్టార్ రజనీకాంత్ ఉన్నారు. ఆయన ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన ఒక రోజులో 2,15,000 ఫాలోవర్స్ అయ్యారు. తాజాగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ 2వ స్థానం దక్కించుకున్నాడు.

English summary
Power Star Pawan Kalyan showed his mass & following once again. Pawan Kalyan twitter followers reached 300k.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu