త్వరలో రాజు సుందరం దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్‌కల్యాణ్
తెలుగు చిత్రసీమకి మరో కొరియోగ్రాఫర్ దర్శకుడిగా రాబోతున్నారు. ఆయనే... రాజు సుందరం. నృత్య దర్శకుడిగా అందర్నీ ఆకట్టుకున్న ఈయన త్వరలో స్టార్ట్ కెమెరా యాక్షన్ అంటారు. ఈయన దర్శకత్వంలో నటించే కథానాయకుడు... పవన్‌కల్యాణ్. ఇప్పటికే వీరి మధ్య చర్చలు జరిగాయనీ, రాజు చెప్పిన కథాంశం పవన్‌కి నచ్చిందని విశ్వసనీయ సమాచారం. పవన్‌కల్యాణ్ సినిమాలు చేయడంలో వేగం పెంచారు.
ప్రస్తుతం విష్ణువర్ధన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోల్‌కతాలో సాగుతోంది. ఆ తరవాత జీసస్ సినిమా, గబ్బర్ సింగ్ ఉంటాయి. ఈ వరుసలోనే రాజు సుందరం సినిమా వస్తుందని తెలిసింది. ప్రముఖ నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో తెలుస్తాయి. రాజు సుందరానికి తెలుగులో దర్శకుడిగా ఇదే మొదటి సినిమా. తమిళంలో అజిత్, నయనతార జంటగా 'ఏగన్' అనే సినిమాని రూపొందించారు.


Click it and Unblock the Notifications











