పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు కంటి సర్జరీ
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కంటి సర్జరీ చేయించుకోబోతున్నారు. గత కొన్ని నెలలుగా ఐ ఇన్‌ఫెక్షన్‌తో బాధ పడుతున్న ఆయనకు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో సర్జరీ నిర్వహించనున్నారు. ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆయన గత కొన్ని రోజులుగా ఎక్కడికి వెళ్లినా చలువ కళ్లద్దాలతో కనిపిస్తున్న తెలిసిందే.
తాను చలువ కళ్లద్దాలు పెట్టుకునేది స్టైల్ కోసం కాదని, కంటికి సంబంధించిన సమస్యతో బాధ పడుతున్నానని, ఎక్కువ వెలుతురు చూడలేక పోతున్నానని, అందుకే వాటిని దరిస్తున్న పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో వెల్లడించారు.

సినిమాలను వదిలేసి రాజకీయాల వైపు వెళ్లిన పవన్ కళ్యాణ్ కొన్ని రోజులుగా పొలిటికల్ బస్ యాత్ర నిర్వహిస్తున్నారు. అయితే రంజాన్ సందర్భంగా తన యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఈ సమయంలోనే ఆయనకు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యలు వివిధ టెస్టులు నిర్వహించారు. సర్జరీ చేయాలని సూచించారు. త్వరలోనే ఆయనకు సర్జరీ నిర్వహించనున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర వైజాగ్ నుంచి ఈ నెల 26న మళ్లీ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ నెలాఖరులోపు విశాఖపట్నం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు.


Click it and Unblock the Notifications