పవన్ కళ్యాణ్ లో ఎవరు చూడని కోణం.. కెమెరాతో మరొక హీరోను ఫొటో తీస్తూ.. వైరల్ పిక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోవైపు తన సినిమాలతో ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో రాజకీయాలతో మరింత బిజీగా మారినున్న పవర్ స్టార్ ముందుగానే ఒప్పుకున్న సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కు రాజకీయాల్లోకి నిత్యం అనేక రకాల విషయాలపై చర్చలు జరుపుతూనే ఉన్నాడు. కానీ కేవలం ఆయనకు షూటింగ్ స్పాట్ లో మాత్రమే కొంత విశ్రాంతి దొరుకుతుంది అని చెప్పవచ్చు. ఇక రీసెంట్ గా పవర్ స్టార్ మరొక హీరోను కెమెరా పట్టుకొని ఫొటో తీయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

 ఎదుటివారితో ఫ్రెండ్లీగా..

ఎదుటివారితో ఫ్రెండ్లీగా..

ఇక షూటింగ్ స్పాట్ లో పవన్ కళ్యాణ్ ని ఎలా ఉంటారు అనే విషయం అందరికీ తెలియదు. తెలిసినవారు చెప్పకుండా ఉండలేరు. అందరినీ ఒకే రకంగా గౌరవించే పవన్ కళ్యాణ్ వీలైనంతవరకు ఎదుటివారితో ఫ్రెండ్లీగా ఉండేందుకు ప్రయత్నం చేస్తాడు. భీమ్లా నాయక్ సినిమాతో కూడా రానా దగ్గుబాటి చాలా ఫ్రెండ్లిగానే ఉన్నట్లు అర్ధమయ్యింది.

బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

శుక్రవారం భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు. మొదటి రోజే ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా వసూళ్లను సాధించింది. అలాగే గత సినిమాల రికార్డులను కూడా బ్రేక్ చేసింది. అంతేకాకుండా 2022 లో అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా కూడా గుర్తింపు అందుకుంది.

మరో 60కోట్లు వస్తేనే..

మరో 60కోట్లు వస్తేనే..

రెండవ రోజు కూడా భీమ్లా నాయక్ సినిమాకు భారీ స్థాయిలో వసూలు అందాయి. రెండు రోజుల్లో కలిపి ప్రపంచ వ్యాప్తంగా పవర్ స్టార్ సినిమా 50 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. 107 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మార్కెట్లోకి వచ్చిన ఈ సినిమా మరొక 60 కోట్ల సాధించగలిగితే బాక్సాఫీస్ వద్ద హిట్ అయినట్లు లెక్క. మరి ఆ టార్గెట్ ను ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది.

రానా కూడా ఫిదా..

రానా కూడా ఫిదా..

భీమ్లా నాయక్ సినిమా మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో రానా దగ్గుబాటి కూడా మరొక ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ సినిమాతో రానా దగ్గుబాటి కూడా పవన్ కళ్యాణ్ గురించి కూడా అర్ధం చేసుకున్నట్లుగా అతను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాటలను బట్టి అర్థమైంది. ఆయన చాలా మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి అని కూడా చెప్పారు.

 ఫొటోగ్రాఫర్ గా మారిన పవన్

ఫొటోగ్రాఫర్ గా మారిన పవన్

రానా దగ్గుబాటి చెప్పిన మాటలు నిజమే అని అందరికీ తెలిసిన విషయమే. ఇక ప్రస్తుతం ఒక ఫోటో కూడా అందుకు సాక్ష్యంగా నిలిచింది. పవన్ కళ్యాణ్ కి ఎంత స్టార్ హీరో అయినప్పటికీ కూడా ఎదుటివారితో మాత్రం చాలా స్నేహంగా ఉంటారు అని చెప్పవచ్చు. భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ స్పాట్ లో పవన్ కళ్యాణ్ ఒక కెమెరా పట్టుకొని స్టిల్ ఫోటోగ్రాఫర్ లో మారిపోయాడు. రానా దగ్గుబాటి తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ కూడా కూర్చుని ఉన్నాడు.

 ఫోటో వైరల్..

ఫోటో వైరల్..

ఇక పవన్ కళ్యాణ్ తీసిన ఫోటోకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ నవ్వుతూ ప్రత్యేకంగా వారిని ఫోటో తీసిన విధానం నెటిజన్లను కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. పవన్ కళ్యాణ్ సింప్లిసిటీ ని అక్కడ ఉన్న వారు కూడా అందరూ చూసి సంతోషపడుతున్నట్లుగా అర్థమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X