OG: ఈసారి ఏకంగా బాలీవుడ్ స్టార్ ను దింపిన సుజిత్.. పవర్ఫుల్ రోల్ కోసమే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాలుగు షెడ్యూల్స్ షూటింగ్ లో పార్టిసిపేట్ చేశాడు. ఆయనకి సంబందించిన కీలక ఎపిసోడ్స్ ని సుజిత్ ముందుగా పూర్తి చేశాడు. ఇప్పుడు పవన్ వారాహి యాత్రలో ఉన్నారు.
అయిన ఓజీ మూవీ షూటింగ్ కొనసాగుతోంది. పవర్ స్టార్ ఈ చిత్రంలో గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నాడు.ఈ సినిమా కోసమే ఎక్కువ డేట్స్ ని కూడా కేటాయించారు. మూవీలో ప్రియాంకా ఆరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి పాన్ ఇండియా అప్పీల్ కోసం అన్ని భాషల నుంచి నటీనటులని ఎంపిక చేస్తూ ఉండటం విశేషం.

ఇప్పటికే కోలీవుడ్ నుంచి టాలెంటెడ్ యాక్టర్ అర్జున్ దాస్ ని నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ కోసం ఎంపిక చేశారు. ఇక సీనియర్ యాక్టర్ శ్రియా రెడ్డి రీసెంట్ గా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఆమెని కూడా ఒక ప్రెస్ నోట్ తో అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. ఇప్పుడు ఓజీ మూవీ కోసం మరో స్టార్ యాక్టర్ ని రంగంలోకి దించారు. అతను కూడా బాలీవుడ్ స్టార్ కావడం విశేషం.
బాలీవుడ్ లో కిస్సింగ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం ఇంటరెస్టింగ్ కథలతో మూవీస్ చేస్తోన్న స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హస్మీని ఓజీ మూవీ కోసం ఎంపిక చేశారు. తాజాగా డివీవీ ఎంటర్టైన్మెంట్ ట్విట్టర్ పేజీ నుంచి అఫీషియల్ గా అతను మూవీలో నటించబోతున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఇక చిత్రంలో ఇమ్రాన్ హస్మీ పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడంట.
తాజాగా అతనిని ఎంపిక చేసినట్లుగా ఖరారు చేశారు. ప్రస్తుతం జరుగుతోన్న షూటింగ్ లో కూడా ఆయన పాల్గొంటాడని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పవర్ ఫుల్ ప్రతినాయకుడిగా ఇమ్రాన్ హస్మీ పాత్ర ఓజీలో ఉండబోతుందంట. మొత్తానికి బాలీవుడ్ స్టార్ హీరో ఓజీలో జాయిన్ కావడంతో ఈ సినిమా రేంజ్ ఇప్పుడు అమాంతం పెరిగిపోయిందని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











