వకీల్ సాబ్ న్యూ ఇయర్ సర్ ప్రైజ్.. కౌంట్ డౌన్ మొదలైంది.. ఎప్పుడంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం వకీల్ సాబ్. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 2019 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక మొత్తానికి థియేటర్స్ ఓపెన్ కావడంతో సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు.
అయితే అంతకంటే ముందు సినిమాకు సంబంధించిన ఒక టీజర్ ను విడుదల చేయవచ్చని సమాచారం. పింక్ సినిమాకు రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ సినిమాను వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఇటీవల సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ పై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక న్యూ ఇయర్ సందర్భంగా 2021 మొదటి సేకనుకు ఒక అప్డేట్ ఇవ్వనున్నారట.

న్యూ ఇయర్ మొదలైన మిడ్ నైట్ 12గంటలకు అప్డేట్ అంటే అభిమానులకు సరికొత్త కిక్కు దొరికొనట్లే. అసలైతే సినిమాను ఈ సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు కానీ కరోనా డోస్ తగ్గేవరకు రిస్క్ చేయకపోతేనే బెటర్ అని మళ్ళీ నిర్ణయాన్ని మార్చుకున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా వకీల్ సాబ్ టీజర్ పై ఎదో ఒక క్లారిటీ ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం.
మొన్నటి వరకు ఇదొక రూమర్ అనే టాక్ వచ్చింది. కానీ ఇటీవల చిత్ర యూనిట్ జరిపిన చర్చల్లో టీజర్ పై కూడా ఒక క్లారిటికి వచ్చినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా అభిమానులకు కిక్కిచ్చేలా టీజర్ ను విడిదల చేయాలని చూస్తున్నారట. మరో రెండు రోజుల్లో ఈ విషయంపై ఒక క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. మరి ఆ టీజర్ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలను పెంచుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











