ఈ ఏడాదిలో పవర్ స్టార్ అభిమానులకు పండగే.. రెండు సినిమాలు జెట్ స్పీడ్ లోనే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే బ్రో అవతార్ మూవీ కంప్లీట్ చేసేశారు. ఈ మూవీ జులై 28న రిలీజ్ కావడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ వరుస షెడ్యూల్స్ తో శరవేగంగా కొనసాగుతోంది.

వీలైనంత వేగంగా ఈ మూవీ పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ కి జోడీగా ప్రియాంకా ఆరుళ్ మోహన్ నటిస్తోంది. ఏమే కెరియర్ లో చేస్తోన్న పెద్ద ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. పాన్ ఇండియా లెవల్ లో గ్యాంగ్ స్టార్ కథాంశంతో ఈ చిత్రాన్ని సుజిత్ తెరకెక్కిస్తున్నారు. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Pawan kalyan

వీటితో పాటుగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ దశలో ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అలాగే పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉంది. క్రిష్ ఈ ఏడాది ఎట్టి పరిస్థితిలో ఆ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫోకస్ అంతా ఓజీ, ఉస్తాద్ సినిమాలపైన మాత్రమే ఉందని తెలుస్తోంది.

వీటిని కంప్లీట్ చేసిన తర్వాతనే హరిహర వీరమల్లు స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఈ ఏడాది పవన్ కళ్యాణ్ నుంచి బ్రో అవతార్ తో పాటు, ఓజీ సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. ఓజీ మూవీ డిసెంబర్ లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సంక్రాంతి టార్గెట్ పెట్టిన అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది చూడాలి.

ఇక హరి హర వీరమల్లు షూటింగ్ 35 రోజులు చేయాల్సి ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ అయ్యాక హరిహర వీరమల్లు స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందంట. ఈ లెక్కన విజువల్ ఎఫెక్ట్స్ బేస్డ్ మూవీ కాబట్టి కచ్చితంగా వచ్చే ఏడాది వేసవి తర్వాతనే ఆ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X