పవన్ కళ్యాణ్ పుట్టినరోజున డబుల్ ధమాకా.. బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సెప్టెంబర్ 2 రానే వచ్చేసింది. రేపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవర్ స్టార్ అభిమానులు ఆయనకు భారీ స్థాయిలో విషెస్ అంధించాలని రెడీ అయ్యారు. ఇక సోషల్ మీడియాలో కూడా సరికొత్తగా రికార్డులు క్రియేట్ అవుతాయని చెప్పవచ్చు. ఇక ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ పై కూడా అప్పుడే అంచనాల డోస్ పెరిగింది.

Recommended Video

Pawan Kalyan Birthday: రికార్డులు బద్దలు కొట్టడానికి ఫ్యాన్స్ రెడీ | Vakeel Saab | PSPK 27 | PSPK 28
ఆ దెబ్బను మర్చిపోయేలా..

ఆ దెబ్బను మర్చిపోయేలా..

అజ్ఞాతవాసి సినిమాతో అభిమానులకు కోలుకోలేని దెబ్బ పడిందనే చెప్పాలి. అందుకే ఆ సినిమా రిజల్ట్ ని మర్చిపోయేలా మరో సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు. ఇక నెక్స్ట్ పింక్ రీమేక్ వకీల్ సాబ్ సినిమాతో పవన్ అభిమానుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ని అంధించారు.

పవన్ బర్త్ డే కోసం

పవన్ బర్త్ డే కోసం

సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి కూడా పోస్టర్, ఒక సాంగ్ తప్పితే మరో అప్డేట్ లేదు. దాదాపు షూటింగ్ ఏండింగ్ లోకి వచ్చేసింది. ఇక థియేటర్స్ ఓపెన్ అయిన తరువాతనే సినిమా ప్రమోషన్స్ డోస్ పెంచుకోవాలని అనుకున్నారు. కానీ బర్త్ డే ఉండడంతో అభిమానుల కోసం ఒక స్పెషల్ అప్డేట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.

వకీల్ సాబ్ స్పెషల్ ట్రీట్..

వకీల్ సాబ్ స్పెషల్ ట్రీట్..

ఇక రేపు 9:09గంటలకు వకీల్ సాబ్ కి సంబంధించిన ఒక స్పెషల్ ట్రీట్ రానున్నట్లు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఎట్టకేలకు ఈ న్యూస్ ఒక మంచి కిక్కిచ్చింది. దీంతో ఎలాంటి అప్డేట్ ఇస్తారో అనే విషయంపై అంచనాలు మొదలయ్యాయి. టీజర్ లాంటిది ఏదైనా రిలీజ్ చేయవచ్చని టాక్ వస్తోంది.

గబ్బర్ సింగ్ కాంబో అప్డేట్

గబ్బర్ సింగ్ కాంబో అప్డేట్

ఇక రేపే హరీష్ శంకర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన సర్ ప్రైజ్ కూడా రాబోతోంది. గబ్బర్ సింగ్ తరువాత పవన్ కళ్యాణ్ తో హరీష్ చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై కూడా అంచనాలు అకాశాన్ని దాటేస్తున్నాయి. ఇక బుధవారం సాయంత్రం 4:05గంటలకు సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ గిఫ్ట్ రానున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X