ఇష్టమైన దర్శకుడితో పవన్ మరో సినిమా.. ఎన్నికలకు ముందే అవినీతిపై..
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలనే కాకుండా తన రెగ్యులర్ పొలిటికల్ లైఫ్ తో కూడా బిజిబిజిగా గడుపుతున్నాడు. వీలైనంతవరకు సినిమాల విషయంలో పవన్ ఒక జాగ్రత్త అయితే తప్పకుండా తీసుకుంటున్నాడు. మంచి సోషల్ మెస్సేజ్ ఉండేలా కథలను సెట్ చేసుకుంటూ కమర్షియల్ ఫార్ములాలను పక్కన పెట్టేస్తున్నాడు. ఇక ఎన్నికలకు ముందు పవన్ ఒక పవర్ఫుల్ సినిమాను చేయబోతున్నాడట.

కమర్షియల్ సినిమాలను పక్కనపెట్టి..
పాలిటిక్స్ లో కొనసాగుతున్న సమయంలో నటీనటులుకమర్షియల్ సినిమాలను వీలైనంత వరకు దూరం పెడుతూనేఉంటారనేవిషయం అందరికి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ కూడా చాలా వరకు సందేశాత్మక సినిమాలను చేయాలనీ అనుకుంటున్నాడు. ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమాల్లోవకీల్ సాబ్కూడా మంచి సందేశం ఉన్న సినిమానే. ఇక ఆ తరువాత అయ్యప్పనుమ్ కోశియుమ్అలాగే క్రిష్దర్శకత్వంలోచేస్తున్న సినిమా కూడా మంచి సినిమాలే.

ఆ రెండు సినిమాల కోసం..
ఇక వీటి తరువాత పవన్ మరింత బిజీగా మారనున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలోఒక సినిమాని అలాగే సురేందర్రెడ్డి దర్శకత్వంలోకూడా మరో సినిమానుచేయనున్నాడు. అయితే పవన్ ఈ రెండుసినిమాలనుపూర్తీ చేయడానికి కేవలం ఐదారునెలలకంటే ఎక్కువ సమయాన్ని తీసుకోడనితెలుస్తోంది.

ఎన్నికల కంటే ముందే..
అయితే పవన్ ఫోకస్ ఎక్కువగా ఒక పొలిటికల్ క్రైమ్ సినిమాపైఉన్నట్లు తెలుస్తోంది. ఇచ్చిన కమిట్మెంట్స్ప్రకారం చేతిలో ఉన్న ఐదు సినిమాలలోఏ సినిమా విడుదల కాకపోయినా కూడా పర్లేదట. కానీ తన మనసులో బలంగా అనుకున్న ఒక సినిమాని మాత్రం ఎలాగైనా ఎన్నికల సమయానికి, అంటే ఒక ఏడాది ముందే రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నాడట.
Recommended Video

ఇష్టమైన దర్శకుడితోనే..
పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన దర్శకుల్లోపూరి జగన్నాథ్ ఒకరు. బద్రిసినిమా అనంతరం కెమెరామెన్ గంగతోరాంబాబు అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అదే దర్శకుడితో అవినీతి దేశంలోజరిగే పొలిటికల్ అవినీతి కుంభకోణాలపై సినిమా చేయాలనీఅనుకుంటున్నాడట. ఎలక్షన్స్ కు ముందే ఆ సినిమాని రిలీజ్ చేయాలనీపక్కా ప్లాన్ తో రెడీ కానున్నట్లుసమాచారం. పూరి కూడా ఇప్పటికేస్క్రిప్ట్ సిద్ధం చేసినట్లుగా టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకునిజమో తెలియాలిఅంటే మరికొన్ని రోజులు వేయాల్సిందే.


Click it and Unblock the Notifications











