Ustad Bhagath Singh: పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన రాక్ స్టార్.. ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిష్ శంకర్ దర్శకత్వంలో మాస్ కమర్షియల్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తమిళ హిట్ మూవీ తెరి కి రీమేక్ అని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. అయితే సినిమా ఒరిజినల్ కంటెంట్ కు మ్యాచ్ కాకుండా దర్శకుడు ఈ సినిమాను వెండితెరపైకి తీసుకురాబోతున్నట్లు కూడా మరికొంతమంది టెక్నీషియన్స్ కూడా క్లారిటీ ఇచ్చారు.
తప్పకుండా ఫాన్స్ ను ఈ సినిమా ఏమాత్రం నిరాశపరచదు అని బలంగా చెబుతున్నారు. ఇక గబ్బర్ సింగ్ ఏ తరహాలో సక్సెస్ అయిందో ఈ సినిమా కూడా అంతకుమించి అనేలా ఉంటుంది అని హరీష్ శంకర్ కూడా చెబుతున్నాడు. అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యే విధంగా ముందుగానే అప్డేట్స్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సోషల్ మీడియా ద్వారా ఒక మంచి న్యూస్ అయితే ఇచ్చాడు. మే 11వ తేదీ నాటికి గబ్బర్ సింగ్ సినిమా విడుదలై సరిగ్గా 11 ఏళ్లు పూర్తవుతుంది.

ఈ క్రమంలో ఉస్తాద్ భగత్ సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేయాలి అని చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పటికే అందుకు తగ్గ అన్ని పనులను కూడా పూర్తి చేసుకున్నాడు. ఇక రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కూడా అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. తప్పకుండా అప్డేట్ అయితే మీకు సరికొత్త కిక్ ఇస్తుంది అని దేవిశ్రీప్రసాద్ తెలియజేశాడు.
ఇక ఈ సినిమాలో సాంగ్స్ కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయట. ఈ సినిమాను 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఓజి సినిమాతో పాటు వినోదాయ సీతమ్ సినిమాను కూడా వచ్చే ఏడాది విడుదల చేయనన్నాడు. అలాగే హరిహర వీరమల్లు సినిమా కూడా షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులతో పాటు పవన్ కళ్యాణ్ త్వరలోనే సుధీర్ వర్మ దర్శకత్వంలో కూడా కొత్త సినిమాను స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











