Vakeel Saab అరాచకం.. పవన్ కళ్యాణ్ కొత్త అవతారం.. ప్రథమార్థం హైలెట్స్ ఇవే!
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. సోషల్ మీడియా మొత్తం వకీల్ సాబ్ హవానే కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వకీల్ సాబ్ టాక్ నడుస్తోంది. మూడున్నరేళ్ల గ్యాప్‌ను అభిమానుల ఎదురుచూపులను, వారి ఆకలిని తీర్చి సంతృప్తి కలిగించాడనే టాక్ వచ్చేసింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయబోతోన్నాడు. లెక్కలకు కొత్త లెక్కలు చూపించబోతోన్నాడు.

ఫ్యాన్స్ షోలతో హంగామా..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ కోసం సపరేట్ షోలు పడ్డాయి. అర్దరాత్రి నుంచే అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరారు. ఇక బెనిఫిట్ షోలు, ఫ్యాన్స్ షోలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో హంగామా నడుస్తోంది. అయితే ఇప్పటికే పలు చోట్ల ఫస్టాప్ కంప్లీట్ అయింది.

ప్రథమార్థం రచ్చ..
వకీల్ సాబ్ ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ అదిరిపోయింది. హీరోయిజం ఎలివేషన్, పవన్ కళ్యాణ్ డిఫరెంట్ లుక్స్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్స్ అన్నీ కూడా ఓ రేంజ్‌లో వర్కవుట్ అయ్యాయని అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. అలా మొత్తంగా ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని అంటున్నారు.

అవే హైలెట్స్..
వకీల్ సాబ్ ప్రథమార్థంలో ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ హైలెట్ అయ్యేలా ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ జార్జిరెడ్డి లాంటి పాత్రను పోషించడం, ఆ తరువాత మానవ హక్కుల పోరాటయోధుడైన బాల గోపాల్‌గా పవన్ కళ్యాణ్ అవతారం అదిరిపోనుందట.
Recommended Video

పొలిటికల్ పంచ్‌లు..
ఇక శ్రుతీ హాసన్‌తో ఫ్లాష్ బ్యాక్ కూడా బాగానే ఉందని తెలుస్తోంది. అయితే ఇందులోనూ పొలిటికల్ పంచ్‌లు బాగానే పేలినట్టు తెలుస్తున్నాయి. సినిమాలో ఓ ఎంపితో పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు.. డీఎస్సీ నోటిఫికేషన్, భూముల కబ్జాల గురించి వేసే సెటైర్లు అదిరిపోయాయని తెలుస్తోంది. మొత్తానికి బొమ్మ బ్లాక్ బస్టర్ అని అందరూ అంటున్నారు.


Click it and Unblock the Notifications











