వకీల్ సాబ్ ఓవర్సీస్ బిజినెస్.. మరోసారి సత్తా చాటిన పవర్ స్టార్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ థియేటర్స్ లోకి రావడానికి ఇంకా కొన్ని రోజులే ఉంది. గత ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఆ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబంధించిన బిజినెస్ లెక్కలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
చివరగా అజ్ఞాతవాసి డిజాస్టర్ అయినప్పటికీ పవర్ స్టార్ మార్కెట్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రీ రిలీజ్ లెక్కలు చూస్తుంటే మరోసారి ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ అయ్యేలా ఉన్నాయని అనిపిస్తోంది. సినిమా మొత్తంగా 100కోట్ల బిజినెస్ చేయగలదని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఓవర్సీస్ లో లాక్ డౌన్ తరువాత రిలీజ్ అవుతున్న సినిమాల్లో అత్యదిక ధర పలికిన తెలుగు సినిమాగా వకీల్ సాబ్ నిలిచింది.

ఫార్స్ ఫిలిమ్స్ అనే సంస్థ వకీల్ సాబ్ ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను 4కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. జాతిరత్నాలు సినిమా ఇప్పటికే యూఎస్ లో హడావుడి మొదలు పెట్టింది. ఇక పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ వస్తే మరో రేంజ్ కు వెళ్లడం కాయం. బాలీవుడ్ పింక్ సినిమాకు రీమేక్ గా వచ్చిన వకీల్ సాబ్ ను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక దిల్ రాజు - బోణి కపూర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.


Click it and Unblock the Notifications











