Vakeel saab.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బీ రెడీ.. రికార్డులు బద్దలయ్యేది అప్పుడే
టాలీవుడ్‌లో ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాలను డేట్స్‌ను బుక్ చేసేసుకున్నాయి. పెద్దా చిన్నా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ విడుదల తేదీని ప్రకటించేశారు. దాదాపు అందరూ కూడా ముందే చర్చించుకున్నట్టున్నారు. ఎక్కడా కూడా క్లాషెస్ రాకుండా గ్యాప్ ఉండేలానే చూసుకున్నారు. అయితే అందరి సినిమా విడుదల తేదీలు వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ డేట్ మాత్రం రాలేదేంటని అభిమానులు ఎదురుచూడసాగారు.

టీజర్‌తో అంచనాలు..
వకీల్ సాబ్ సినిమాపై ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. గ్యాప్ తీసుకుని మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుండటంతో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌పై అంచనాలు అమాంతం పెరిగాయి. పాటతో అంచనాలను రెట్టింపు చేసేశారు. మగువా మగువా అనే పాట ఇప్పటికీ హృదయాలను తాకుతూనే ఉంది. ఇక టీజర్‌తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు.

అప్టేట్లతో రచ్చ..
టాలీవుడ్ మొత్తం అప్డేట్లతో మారుమోగుతుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం అలా ఎదురుచూస్తున్నారు. మార్చి, ఏప్రిల్, మే నెల అంటూ అందరూ కూడా తమ తమ సినిమాలకు డేట్లను ఫిక్స్ చేసుకున్నారు. వకీల్ సాబ్ సమ్మర్‌లో వస్తుందని ఎప్పుడో ప్రకటించారు. కానీ డేట్ మాత్రం బయటకు చెప్పలేదు.

వచ్చేది ఆ రోజే..
ఇక తాజాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు అసలు సిసలైన ట్రీట్ ఇచ్చారు. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ థియేటర్లలో సందడి చేయబోతోందని ప్రకటించేశారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అయితే ఏప్రిల్‌లో విడుదలయ్యే సినిమాల జాబితా కూడా చాలానే ఉంది.

పోటీ లేకుండానే..
పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఫస్ట్ డే కలెక్షన్లు, వాటి రికార్డుల గోల ఉంటుంది. అలా వాటికి భయపడి దాదాపు ఏ సినిమాలు కూడా అదే రోజున రిలీజ్ కావు. కానీ వకీల్ సాబ్ కంటే వారం రోజుల ముందుగా సీటీమార్ వస్తోంది.. వకీల్ సాబ్ విడుదలై వారం తరువాత లవ్ స్టోరీ, టక్ జగదీశ్ వచ్చేలా ఉన్నాయి. ఏది ఏమైనా ఏప్రిల్ 9న మాత్రం బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం మాత్రం ఖాయం.


Click it and Unblock the Notifications











