పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో వకీల్ సాబ్ ఒకటి. సినిమా పనులు ఆల్ మోస్ట్ పూర్తయినప్పటికి ఇంకా టీజర్ ను కూడా వదలలేదు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా యొక్క అప్డేట్స్ సోషల్ మీడియాలో అయితే బాగానే వైరల్ అయ్యాయి.
ఈ ఎడాది ట్విట్టర్ లో ట్రెండ్ అయిన ట్యాగ్స్ లలో వకీల్ సాబ్ కూడా నిలిచింది అంటే హవా ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఇక సినిమాను సంక్రాంతి రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు మొన్నటి వరకు ఒక రూమర్ వచ్చింది. కానీ ఇప్పటికీ కూడా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోవడంతో సంక్రాంతి రేసులో ఉండకప్పవచ్చని అర్ధమవుతోంది. ఇక సినిమా టీజర్ కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
వీలైనంత వరకు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన తరువాతనే దిల్ రాజు సినిమా టీజర్ వంటివి రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. ఆ విషయంలో క్లారిటీ లేకుండా రిస్క్ చేస్తే మొదటికే మోసం వస్తుందని ఛాన్స్ తీసుకోవడం లేదట. దిల్ రాజు వకీల్ సాబ్ పై నమ్మకం చాలానే పెట్టుకున్నాడు. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీగా లాభాలను అందుకోవాలని అనుకుంటున్నాడు. ఇక సినిమా టీజర్ ను న్యూ ఇయర్ కు రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు మరొక టాక్ వస్తోంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.
The Tollywood industry has missed a lot of films due for release this year. Plans all changed at once with the corona braking at 20 to 20 speed. There are a lot of mega hero movies to be released this year. First Acharya Cinema. Megastar Chiranjeevi, the film is set to release in 2020 in a combination of fights. The shooting had to be postponed to next year as the corona arrived less than halfway through.
Story first published: Tuesday, December 15, 2020, 15:44 [IST]