Vakeel saab Teaser.. కోర్టులో వాదించడం తెలుసు.. కోట్ తీసి కొట్టడమూ తెలుసు!!
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు అసలు సిసలైన పండుగ వచ్చింది. ఒక వైపు సంక్రాంతి సెలెబ్రేషన్స్ జరుగుతున్నా కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు మాత్రం అసలు వేడుక ఇప్పుడే సిద్దమైంది. వకీల్ సాబ్ టీజర్ రికార్డులపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఫ్యాన్స్ యుద్దం మొదలైంది. తాజాగా వకీల్ సాబ్ టీజర్ రిలీజ్ అయింది. ఇక మరో వైపు రికార్డుల వేట కూడా మొదలైంది. ఇన్నాళ్లకు వకీల్ సాబ్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చిందంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

‘వకీల్ సాబ్'పై అంచనాలు..
వకీల్ సాబ్ సినిమాపై ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. దాదాపు మూడు నాలుగేళ్ల తరువాత పవన్ కళ్యాణ్ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోన్న చిత్రం కావడంతో అందరికీ అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. దీనికి తగ్గట్టు రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు కూడా ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి.

ఇటీవలె పూర్తి..
వకీల్ సాబ్ షూటింగ్ ఇటీవలె పూర్తయింది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్ స్పెషల్ ట్వీట్లు వేశారు. వకీల్ సాబ్ చివరి రోజున పవన్ కళ్యాణ్ చిత్రయూనిట్‌తో సందడి చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయని దిల్ రాజు తెలిపాడు.

సంక్రాంతి రచ్చ..
మామూలుగా సంక్రాంతికి సినిమాల సందడి ఎలా ఉంటుందో తెలిసిందే. టాలీవుడ్‌లో సంక్రాంతి పండుగ అంటే రిలీజ్‌లు, అప్డేట్లు, టీజర్లు, పోస్టర్లు, ట్రైలర్లంటూ అందరూ రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇప్పటికే చాలా మంది అప్డేట్లతో సందడి చేయగా.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది.
టీజర్‌తో సందడి..
వకీల్ సాబ్ టీజర్‌తో సంక్రాంతి సంబురాలను రెట్టింపు చేసేందుకు పవన్ కళ్యాణ్ వచ్చేశాడు. టీజర్‌పై అంచనాలు పెంచేందుకు చిత్రయూనిట్ గత రెండు మూడు రోజుల నుంచి ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేసింది. ఎట్టకేలకు ఆ ఘడియలు రానే వచ్చాయి. టీజర్‌తో వకీల్ సాబ్ అందర్నీ పలకరించాడు.

కోర్టులో వాదించడం తెలుసు..
వకీల్ సాబ్ టీజర్‌లో పవన్ కళ్యాణ్‌ను మరింత స్టైలీష్‌గా చూపించారు. మాస్, ఫ్యాన్స్‌కు కావాల్సిన అన్నింటిని అందులో సమకూర్చారు. యాక్షన్ సీక్వెన్స్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. కోర్టులో వాదించడం తెలుసు.. కోట్ తీసి కొట్టడం తెలుసు అంటూ పవన్ కళ్యాణ్ పేల్చిన డైలాగ్ అదిరిపోయింది.


Click it and Unblock the Notifications











