Vakeel saab దెబ్బకు బాహుబలి రికార్డులు మటాష్.. ఆ విషయంలో టాలీవుడ్ నెంబర్ వన్
పవన్ కళ్యాణ్ ఒక్కసారి వెండితెరపై విజృంభిస్తే ఎలా ఉంటుందో తాజాగా నిరూపించాడు. కేవలం వకీల్ సాబ్ ట్రైలర్‌తోనే రచ్చ రచ్చ చేసేశాడు. ఇప్పటికీ వకీల్ సాబ్ మానియా తగ్గడం లేదు. నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి మొదలైన ట్రెండ్.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మొత్తానికి 24 గంటల్లో వకీల్ సాబ్ కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. వకీల్ సాబ్ దెబ్బకు బాహుబలి రికార్డులు కూడా ఖతమయ్యాయి.

పవన్ కళ్యాణ్ సత్తా..
పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరైన బొమ్మ పడితే అది ఇండస్ట్రీ హిట్ అవ్వాల్సిందే. ఇక సోషల్ మీడియాలో పవర్ స్టార్ ఫ్యాన్స్ చేసే హంగామా గురించి అందరికీ తెలిసిందే. చాలా గ్యాప్ తరువాత వకీల్ సాబ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంలో అంచనాలు ఆకాశన్నంటాయి.

దానికి తగ్గట్టే..
అభిమానుల అంచనాలకు తగ్గట్టే వకీల్ సాబ్‌ను తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. ఫ్యాన్స్ కోరుకునే మూమెంట్స్ ఎన్నో ఉన్నాయని ట్రైలర్ చూస్తుంటూనే అర్థమవుతోంది. కోర్ట్ సీన్స్ టాలీవుడ్‌లో నిలిచిపోయేలా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ ఒక్కసారి ఆవేశంతో ఊగిపోయి డైలాగ్స్ చెబితే బాక్సాఫీస్ దద్దరిల్లిపోవాల్సిందే.

24 గంటల్లో సునామీ..
వకీల్ సాబ్ ట్రైలర్ నిన్న సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేశారు. అది ఇప్పటి వరకూ దుమ్ములేపుతూనే ఉంది. ఈ 24 గంటల్లో వకీల్ సాబ్ ట్రైలర్ ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఇంకెన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. 24 గంటల్లో 22.44 రియల్ టైం వ్యూస్‌ను క్రాస్ చేసి సత్తా చాటింది.

బాహుబలి రికార్డులు..
రియల్ టైం వ్యూస్‌ను యూట్యూబ్ లెక్కించకపోవడంతో.. బాహుబలికి 24 గంటల్లో 21.81 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.. వకీల్ సాబ్‌కు 24 గంటల్లో 18.05 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీంతో బాహుబలి తరువాత వకీల్ సాబ్ రెండో స్థానాన్ని ఆక్రమించింది.

లైక్స్ విషయంలో నెంబర్ వన్..
అయితే యూట్యూబ్ లైక్స్ విషయంలో వకీల్ సాబ్ కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. 24 గంటల్లో వన్ మిలియన్ వ్యూస్ సాధించి బాహుబలి రికార్డులను బద్దలు కొట్టేసింది. బాహుబలికి 24 గంటల్లో కేవలం 497k లైక్స్ మాత్రమే వచ్చాయి. దీంతో లైక్స్ విషయంలో టాలీవుడ్ నెంబర్ వన్ స్థానంలో వకీల్ సాబ్ నిల్చింది.


Click it and Unblock the Notifications











