వకీల్ సాబ్ విధ్వంసం: బాహుబలికి 10గంటలు పడితే పవర్ స్టార్ గంటలో కొట్టేశాడు.. వాటే రికార్డ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అసలైన ఎనర్జి వచ్చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు మూడేళ్ళ అనంతరం పవర్ఫుల్ బూస్ట్ దక్కింది. కేవలం ట్రైలర్ తోనే సరికొత్త సెన్సేషన్ క్రియేట్ అయ్యింది. సోషల్ మీడియాలోనే కాకుండా థియేటర్స్ లలో కూడా వకీల్ సాబ్ మ్యానియా కనిపిస్తోంది. ఇక యూ ట్యూబ్ లో వ్యూవ్స్, లైక్స్ అంటూ సినిమా షాకిచ్చే రికార్డులను క్రియేట్ చేస్తోంది.
ప్రగ్యా జైస్వాల్ క్లీవేజ్ షో.. ఎద అందాలతో ఆకట్టుకొంటున్న బ్యూటీ

ట్రైలర్ తోనే అంచనాలు పెంచేశారు
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమా బాలీవుడ్ హిట్ మూవీ పింక్ ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ రీమేక్ సినిమాపై మొదటి నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక హొలీ రోజు విడుదలైన ట్రైలర్ అంచనాల డోస్ ను మరింత పెంచేసింది.

8నిమిషాల్లోనే..
ఇక సినిమా ట్రైలర్ రికార్డుల మోతతో సోషల్ మీడియాలో వివిధ రకాల హ్యాష్ ట్యాగ్స్ తో ట్రెండ్ అవుతోంది. ఇక నిమిషానికొక రికార్డు క్రియేట్ చేస్తున్న ఈ ట్రైలర్ 8 నిమిషాల్లోనే 100K లైక్స్ అందుకుంది. ఇప్పటివరకు ఇంత ఫాస్ట్ గా ఏ ట్రైలర్ కూడా లైక్స్ అందుకోలేదు. సాహో ట్రైలర్ కు 27నిమిషాల్లో 100k లైక్స్ వచ్చాయి.

గంటల్లోనే మరో రికార్డ్
ఇక 70 నిమిషాల్లోనే 400K లైక్స్ రావడం మరో బోనస్. చూస్తుంటే బాక్సాఫీస్ కు ఇది ఒక హెచ్చరికలాగా అనిపిస్తోంది. ఎందుకంటే బాహుబలి 2 ట్రైలర్ ఈ టార్గెట్ ను అందుకోవడానికి 10గంటలు పట్టింది. ఇక సాహో ట్రైలర్ 25గంటల్లో 400K లైక్స్ అందుకుంది. కానీ పవన్ ట్రైలర్ గంటలోనే కొట్టేసింది.

ఎవరు ఊహించలేదు
వకీల్ సాబ్ ట్రైలర్ ఈ రేంజ్ లో ట్రెండ్ సెట్ చేస్తూందని ఎవరు ఊహించలేదు. ఒక గంట ముందు థియేటర్స్ లో ట్రైలర్ ను విడుదల చేయగా భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. కేవలం ట్రైలర్ కే విజిల్స్ ఒక రేంజ్ లో వచ్చాయి. ఇక ఏప్రిల్ 9న విడుదల కాబోయే సినిమాకు ఏ స్థాయిలో క్రేజ్ అందుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.


Click it and Unblock the Notifications











