వకీల్ సాబ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ట్రైలర్ రాబోయేది ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ ఏప్రిల్ 9న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ అనంతరం టాలీవుడ్ లో ఇప్పటివరకు పెద్ద స్టార్ హీరో సినిమాలేవి రాలేవు. దీంతో సినిమాపై ఇండస్ట్రీ ప్రముఖుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా తప్పకుండా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుందని టాక్ అయితే వస్తోంది.

ఇప్పటికే టీజర్ తో పాటు సాంగ్స్ కూడా భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేశాయి. ఇక నెక్స్ట్ అందరి చూపు ట్రైలర్ పైనే పడింది. తప్పకుండా అభిమానుల అంచనాలను మరింత పెంచేలా ట్రైలర్ ను రెడీ చేసినట్లు ప్రమోషన్ చేస్తున్నారు. ఇక ట్రైలర్ పై గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్స్ కు ఎట్టకేలకు చెక్ పెట్టేశారు. ట్రైలర్ ను ఈ నెల మార్చి 29న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ అయితే ఇచ్చేశారు. సినిమాకు సంబంధించిన లుక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Pawan kalyan Vakeel saab trailer release date locked

పవన్ కళ్యాణ్ మొదటిసారి లాయర్ పాత్రలో కనిపిస్తుండడంతో ఓ వర్గం అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇక సినిమాలో మంచి సందేశంతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కుడా గట్టిగానే ఉంటాయని టాక్ వస్తోంది. ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ: పి.ఎస్‌.వినోద్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: రాజీవ‌న్‌, ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి, డైలాగ్స్‌: తిరు, యాక్ష‌న్ ర‌వివ‌ర్మ‌, వి.ఎఫ్‌.ఎక్స్‌: యుగంధ‌ర్‌, కో ప్రొడ్యూస‌ర్‌: హ‌ర్షిత్ రెడ్డి, స‌మ‌ర్ప‌ణ‌: బోనీ క‌పూర్‌, నిర్మాత‌లు: దిల్‌రాజు, శిరీష్ , ద‌ర్శ‌క‌త్వం: శ్రీరామ్ వేణు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X