నాగబాబులో కొత్త టెన్షన్: పవన్ వర్సెస్ వరుణ్ తేజ్

By Bojja Kumar

హైదరాబాద్: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ‘ముకుంద' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న వరుణ్ తేజ్ మొదటి సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నారు.

అంతా బాగానే ఉంది కానీ....నాగబాబులో కొత్త టెన్షన్ మొదలైంది. అందుకు కారణం పవన్ కళ్యాణే. ఆయన నటించిన ‘గోపాలా గోపాలా' చిత్రం కూడా సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఈ రోజు నిర్మాత సురేష్ బాబు ప్రకటించారు. పవన్ సినిమాతో పోటీ పడటం, ఆయన సినిమా నడుస్తుండగా వరుణ్ తేజ్ లాంటి కొత్త హీరో సినిమాలు విడుదల చేయడం అంత మంచిది కాదనే భావనతో నాగబాబు కాస్త టెన్షన్ పడుతున్నారట.

Pawan Kalyan, Varun Tej in Sankranthi race

ముకుంద సినిమా షూటింగ్ విషయానికొస్తే...పాటలు తప్ప ఈ చిత్రం షూటింగ్ పూర్తైపోయింది. వరుణ్ తేజ ఇప్పటికే డబ్బింగ్ ప్రారంభించేసాడు. సినిమా చాలా బాగా వచ్చిందని, ఖచ్చితంగా ఓ లాండ్ మార్క్ సినిమాగా మిగులుతుందని చెప్తున్నారు. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ చిత్రం విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అలాగే మెగాభిమానులు సైతం తమ క్యాంప్ నుంచి వస్తున్న కొత్త హీరో కోసం వెయిట్ చేస్తున్నారు.

ఇటీవలే విడుదల చేసిన వరుణ్‌తేజ్ ఫస్ట్‌లుక్ మరియు ఫస్ట్‌లుక్ టీజర్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన చిత్రం కావటంతో మంచి క్రేజ్ వచ్చింది. లియో ప్రొడక్షన్స్‌ తెరకెక్కిస్తోంది. నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి) నిర్మిస్తున్నారు. మిక్కీ.జె.మేయర్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, రావు రమేష్‌, నాజర్‌ ఇందులో కీలక పాత్రధారులు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఆడియో రైట్స్ ని ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X