శిరసు వంచి నమస్కరిస్తున్నా.. మీ కష్టం నాకు తెలుసు; 18ఏళ్ల క్రితం..: పవన్ సందేశం

Recommended Video

మీ కష్టం నాకు తెలుసు.. పవన్ ఎమోషనల్ మెసేజ్ !

ఒకప్పుడు ఓవర్ సీస్ మార్కెట్ బాలీవుడ్‌కే పరిమితం. కానీ ఇప్పుడా గోడలు బద్దలయ్యాయి. తెలుగు సినిమా కూడా విదేశాల్లో కోట్లు వసూళ్లు చేసే స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలైతే ఓవర్ సీస్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి.

తాజాగా విడుదలకు సిద్దమవుతోన్న పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి'పై కూడా రికార్డులు కూడా బ్రేక్ చేసే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓవర్ సీస్ లోని తన అభిమానులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ ఓ సందేశమిచ్చారు..

 మీ కష్టం తెలుసు..:

మీ కష్టం తెలుసు..:

విదేశాల్లో ఉన్న తెలుగువారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉన్న ఊరిని వదిలి పక్క ఊరికి వెళ్లి పనిచేయడమే చాలా కష్టం. అలాంటిది రాష్ట్రాలు వదిలి దేశం కాని దేశం వదిలి చదువు కోసం.. ఉద్యోగం కోసం మీరు పడుతున్న కష్టాలేంటివో నాకు తెలుసు.

 శిరసు వంచి..:

శిరసు వంచి..:

ఆత్మగౌరవం కోసం అక్కడ స్థానికత కోసం మీరు పడే ఇబ్బందులు తెలుసు. అందుకే అక్కడ మీకేం జరిగినా.. మీకు అండగా నిలబడటానికి ఇక్కడ కోట్ల మంది ఉన్నారు. నా చిత్రాలను ఆదరిస్తున్న మీకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను.

18ఏళ్ల క్రితం..:

18ఏళ్ల క్రితం..:

'18ఏళ్ల క్రితం బద్రి సినిమా కొన్ని సెంటర్లలో రిలీజ్ అయితేనే అది పెద్ద విజయంగా భావించాం. అలాంటిది భారతీయ సినిమాల్లో దేనికి ఇవ్వనన్ని థియేటర్స్ అజ్ఞాతవాసి సినిమాకు ఇస్తుండటం చాలా సంతోషంగా ఉంది.

 పెద్ద హిట్ చేయాలని..:

పెద్ద హిట్ చేయాలని..:

పవన్ సందేశం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ వ్యాఖ్యలకు ఫిదా అయిపోయిన ఫ్యాన్స్ సినిమాను పెద్ద హిట్ చేసి ఆయనకు కానుకగా ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పటికే ఓవర్ సీస్‌లో ఫ్యాన్స్ హంగామా మొదలైనట్లు తెలుస్తోంది. ఇక సినిమా విడుదల రోజు ఆ హంగామా తారాస్థాయికి వెళ్లడం ఖాయమంటున్నారు.

 ఫ్యామిలీ ఆడియెన్స్..:

ఫ్యామిలీ ఆడియెన్స్..:

అజ్ఞాతవాసికి సెన్సార్ ఇప్పటికే పూర్తయిపోయింది. విడుదల వేళ ఎలాంటి అవాంతరాలు ఉండవద్దన్న ఉద్దేశంతో.. ఒకింత ముందుగానే సెన్సార్ బోర్డు ముందుకు వెళ్లింది చిత్ర యూనిట్. యు/ఎ సర్టిఫికెట్ వచ్చినప్పటికీ.. సినిమాలో అంతగా అభ్యంతరకర సన్నివేశాలు ఉండకపోవచ్చు అంటున్నారు. కాబట్టి ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ ను కూడా ఆకట్టుకునే అవకాశం ఉంది.

బెటర్ టాక్ వస్తే..:

జనవరి 10న విడుదల కాబోతున్న అజ్ఞాతవాసిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు పవన్ సినిమా ఈజీగా నెట్టుకొచ్చేయడం కామన్. అలాంటిది ఇంకాస్త బెటర్ టాక్ వస్తే రికార్డులు తిరగరాయడం కూడా పెద్ద విషయమేమి కాకపోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X