మార్చి నుంచి పవన్ కళ్యాణ్, విష్ణు చిత్రం షూటింగ్ ప్రారంభం
పవన్ కళ్యాణ్ హీరోగా సంఘమిత్ర ఆర్ట్స్ ఆర్కా మీడియా వర్క్స్ సంయుక్త నిర్మాణంలో తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి నీలిమా తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ నిర్మాతలుగా వ్యవహరిస్తారు. మార్చి మొదటి వారంలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా యార్లగడ్డ శోభు మాట్లాడుతూ- పవన్ కళ్యాణ్ చిత్రమంటేనే పవర్‌ఫుల్ కథ ఉండాలి. అటువంటి కథ సిద్ధమైంది. అబ్బూరి రవి సంభాషణలన్నీ రాశాడు. పక్కా యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం నిర్మాణమవుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు నచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుంది. ఇద్దరు హీరోయిన్స్ లలో ఒకరిని ఎంపిక చేశాం. యువన్ శంకర్‌రాజా ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. యువన్ శంకర్ - పవన్ కళ్యాణ్‌ల తొలి కాంబినేషన్ ఇదని తెలిపారు.
ఇక గతంలో విష్ణు వర్ధన్ అజిత్ తో చేసిన భిళ్ళా చిత్రం సంచలన విజయం సాధించి తెలుగులోకి సైతం ప్రభాస్ తో రీమేక్ అయింది. ఇప్పుడా చిత్రం ప్రేక్వెల్ అంటే అసలు భిళ్ళా మాఫియాలోకి ఎలా ఎంటరయ్యాడు. నిల దొక్కుకునే సమయంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి..అన్న ఏంగిల్ లో కథను తయారు చేయాడని తెలుస్తోంది. అయితే భిళ్ళాకి భిళ్ళా2కి పోలిక కేవలం క్యారెక్టర్ కంటిన్యూషనే అని చెప్తున్నారు. ఇక స్టైలిష్ టేకింగ్ తీసే విష్ణు ఈ చిత్రం ఎక్కువ భాగం ఫారిన్ లొకేషన్స్ లో తీయాలని నిర్ణయించారు.ఈ చిత్రానికి ఫైట్స్: శ్యామ్ కౌశల్, రచన: రాహుల్ కోడా, కెమెరా: టి.ఎస్.వినోద్, ఎడిటింగ్: శ్రీహరి ప్రసాద్, నిర్మాతలు: నీలిమ తిరుమలశెట్టి, యార్లగడ్డ శోభు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విష్ణువర్థన్.


Click it and Unblock the Notifications











