స్టైలిష్ డైరెక్టర్ విష్ణు దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...

By Sindhu

ప్రస్తుతం రెండు చిత్రాలు ఏకబిగిన చేస్తున్న పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరో చిత్రాన్ని అంగీకరించారు. పవన్ కళ్యాణ్ కధానాయకునిగా ఓ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనుంది. తమిళంలో స్టయిలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. 'వేదం', 'మర్యాదరామన్న' చిత్రాలు నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ సమర్పణలో సంఘమిత్ర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నీలిమా నగేష్, సోభు యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. 2011 జనవరి నెలాఖరున చిత్రీకరణ మొదలుకానుంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించబోతున్నారు. 'గమ్యం', 'వేదం' చిత్రాల దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి సంభాషణలు సమకూర్చనుండటం విశేషం.

ఈ సందర్భంగా నిర్మాతలు నీలిమా నగేష్, సోభు యార్లగడ్డ మాట్లాడుతూ 'ఇందులో పవన్ కళ్యాణ్ లుక్ చాల విభిన్నంగా అవుంతుంది. సినిమా ఓ పక్క స్టయిలిష్ గానే ఉంటేనే, మరో పక్క అభిమానులు కోరుకునే అన్ని అంశాలతో సంపూర్ణంగా రూపొందుతుంది. ఇందులో ఇద్దరు కధానాయికలు వుంటారు. ప్రస్తుతం వారి ఎంపిక జరుగుతోంది' అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X