twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ - విష్ణువర్థన్ ల మాస్ టైటిల్ ‘కాళి’

    By Sindhu
    |

    వరుస ఫ్లాపులతో వున్న పవన్ కల్యాణ్ మంచి హిట్ కోసం తన తాజా చిత్రాన్ని తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి మనకు తెలుసిందే. ఈ సినిమా షూటింగ్ గత కొన్ని వారాలుగా కోల్ కతాలో జరుగుతోంది. కథ ఎక్కువగా కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో సాగడం వల్ల సగం భాగం షూటింగ్ అక్కడే చేస్తున్నారు. ఈ షూటింగ్ ఈ నెల 26వ తేదీ వరకూ అక్కడే జరుగుతుంది, తర్వాత రామోజీ ఫిల్మ్ సిటి, హైదరాబాద్ లో జరుగనున్నది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తొలిసారిగా గెడ్డం పెంచి మరీ నటిస్తున్నాడు. పవన్ అభిమానులతో పాటు మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా విష్ణువర్థన్ ఈ చిత్రంలో మసాలా అంశాలని జోడిస్తున్నాడు. ఈ గెటప్ లో ఫోటోలు కూడా వచ్చాయి. ప్రస్తుతం పవన్ కల్యాణ్, హీరోయిన్ సారాజేన్ డియాస్ లపై ప్రేమ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

    ఇదిలా ఉంచితే, తిరుమల శెట్టి నీలిమా మరియు శోభు యార్లగడ్డ కలిసి నిర్మిస్తోన్న ఈ సినిమాకి మొదట్లో 'ది షాడో' అనే టైటిల్ పెట్టాలని దర్శకుడు ఉబలాటపడ్డాడు. అయితే, పవన్ కల్యాణ్ కి ఆ టైటిల్ నచ్చకపోవడంతో దానిని వర్కింగ్ టైటిల్ గా అనుకున్నారు. తాజాగా 'కాళి' అనే పేరు పెట్టడానికి నిర్ణయం జరిగిందని తెలుస్తోంది. కోల్ కతా బ్యాక్ డ్రాప్ కూడా కావడం వల్ల, కాళికామాతను స్మరించుకునేలా, ఇందులో హీరో పేరు కూడా అదే కావడం వల్ల ఈ టైటిల్ యాప్ట్ గా ఉంటుందని దానినే డిసైడ్ చేశారట. 'కాళి" టైటిల్ మాస్ స్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కూడా ఉంటుందని భావిస్తున్నారట!

    English summary
    Power Star Pawan Kalyan’s undershoot film in the direction of Vishnuvardhan which was earlier referred as Shadow is now going for a title change. The makers are considering the title Kaali for the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X