నా తుది శ్వాస వరకు ఆయన ఆశయాలకు కట్టుబడి ఉంటాను: పవన్ కళ్యాణ్

"శ్రీ బాబా సాహెబ్ మా జాతికే గర్వకారణమైన గొప్ప నేత.. ఆయన్ను నేను నిజంగా ఆరాధిస్తాను జనసేన పార్టీ ద్వారా నా తుది శ్వాస వరకు ఆయన ఆశయాలకు కట్టుబడి ఉంటాను."

Recommended Video

నా తుది శ్వాస వరకు ఆయన ఆశయాలకు కట్టుబడి ఉంటాను.. - పవన్

ప్రజాసమస్యల పరిష్కారానికి పవన్ చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలను ఇతర దేశాల్లోని సంస్థలు గుర్తిస్తున్నాయి. ఇటు సినిమాలు, అటు రాజకీయాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకెళుతున్న పవన్ కళ్యాణ్ ఇండీ యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ అందించనున్న ఎక్సలెన్సీ అవార్డ్ కి ఎంపికయిన సంగ‌తి తెలిసిందే.

 జనసేన అధినేత

జనసేన అధినేత

పలు ప్రజా సమస్యలపై ఈయన స్పందిస్తున్న తీరుకి గాను పవన్ ని ఈ అవార్డుకి ఎంపిక చేశారు. నిన్ననే ఇండో-యూరోపియన్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు పవన్‌ కళ్యాణ్. బ్రిటన్ పార్లమెంట్ హౌస్‌ ఆఫ్ లార్డ్స్‌లో ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కింది. జనసేన అధినేతగా, ప్రజా సమస్యలపై పోరాడినందుకుగాను ఆయన ఈ అవార్డును అందుకున్నారు.

కింగ్స్ మెడికల్ కాలేజీలో

కింగ్స్ మెడికల్ కాలేజీలో

శుక్ర, శని వారాల్లో లండన్‌లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటాడు. 18వ తేదీన లండన్‌లోని వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులతో వెస్ట్ మినిస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్‌లోని కింగ్స్ మెడికల్ కాలేజీలో పవన్ భేటీ అవుతారు. పవన్ పర్యటనకు సంబంధించి యూరఫ్‌లోని జనసేన కార్యకర్తలు, లండన్‌లోని తెలుగువారు ఏర్పాట్లు చేస్తున్నారు.

 ఆయన్నుంచి ప్రేరణ పొందాను.

ఆయన్నుంచి ప్రేరణ పొందాను.

అయితే పవన్ అంబేద్కర్ మెమోరియల్‌ను సందర్శించినపుడు తీసిన పిక్స్‌ను పరిశీలిస్తే ఓ పిక్‌లో ఏదో రాస్తున్నట్టుగా కనిపిస్తుంది. "శ్రీ బాబా సాహెబ్ ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారు. మా జాతికే గర్వకారణమైన గొప్ప నేత.. ఆయన్ను నేను నిజంగా ఆరాధిస్తాను.. ఆయన్నుంచి ప్రేరణ పొందాను.

జనసేన పార్టీ

జనసేన పార్టీ

జనసేన పార్టీ ద్వారా నా తుది శ్వాస వరకు ఆయన ఆశయాలకు కట్టుబడి ఉంటాను." అని పవన్ ఆటోగ్రాఫ్ చేశాడు. పవన్‌తో పాటు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో అంబేద్కర్ స్మారక మందిరానికి వెళ్లారు. యూరప్ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులతోనూ పవన్ ముచ్చటించనున్నట్లు తెలుస్తోంది.

 స్వల్ప విరామం

స్వల్ప విరామం

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న పవన్.. స్వల్ప విరామం తీసుకొని లండన్ పర్యటనకు వెళ్లాడు. దీనిని.. దీనికి సంబంధించిన వీడియోను జనసేన పార్టీ నిర్వహిస్తున్న సోషల్ మీడియా ద్వారా అప్‌లోడ్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X