పైరసీ తెచ్చిన మార్పా?... పవన్ కళ్యాణ్ కొత్త అలవాట్లు!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి వారో, ఆయన మనస్తత్వం ఎలాంటిదో, ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుగు సినిమా ప్రేక్షకులకు తెలియందేమీ కాదు. ఎంతో నిజాయితీ గల వ్యక్తి. ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం. పబ్లిసిటీ గిమ్మిక్కులు చేయడం ఆయనకు చేతకాదు. ఆయనకు చేతనైంది కేవలం నటించడం మాత్రమే. నిరాడంబరంగా జీవించడానికి ఇష్టపడే వ్యక్తి.
ఉంటే సినిమా షూటింగులోనో, లేదా సినిమాలకు సంబంధించిన చర్చల్లోనో.... ఖాళీగా ఉంటే తన ఫౌంహౌస్‌లో తోట పనిలో సేద తీరుతూ ఉండటం పవన్ కళ్యాణ్ సాధారణంగా చేసే పనులు. అయితే పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. 'అత్తారింటికి దారేది' చిత్రం ముందే లీక్ కాకుండా ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ, పైరసీకి గురైన తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చింది.
పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎప్పుడూ తన సినిమాల సక్సెస్ మీట్లో పాల్గొన్నది లేదు. కానీ 'అత్తారింటికి దారేది' చిత్రం సక్సెస్ మీట్లో పాల్గొన్నారు. కానీ ఆయన పాల్గొంది సినిమాను లీక్ చేసిన కుట్రదారులకు వార్నింగ్ ఇచ్చేందుకే. ఎన్నడూ లేనిది ఆయన ఈ సారి తన సినిమాను ప్రసాద్ లాబ్స్‌లో ప్రత్యేకంగా వీక్షించారు. ఆయనతో పాటు త్రివిక్రమ్ కూడా సినిమా చూసారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు.
పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications












