సతీసమేతంగా రంగస్థలం చూసిన పవన్ కళ్యాణ్.. ఫాన్స్ పండగ చేసుకునే న్యూస్ చెప్పిన పవర్ స్టార్!
Recommended Video

రాజకీయ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ సోమవారం తీరిక చేసుకుని రంగస్థలం చిత్రాన్ని వీక్షించాడు. రాంచరణ్, ఉపాసనతో కలసి సతీసమేతంగా పవన్ ఐమాక్స్ లో రంగస్థలం చిత్రాన్ని చూడడం విశేషం. దర్శకుడు సుకుమార్, చిత్ర నిర్మాత కూడా హాజరయ్యారు. రంగస్థలం విడుదలయ్యాక ఈ చిత్రం విజయం సాధించినందుకు పవన్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే. రంగస్థలం చిత్రం రాంచరణ్ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. చరణ్ అద్భుత నటన, సుకుమార్ టేకింగ్ చిత్ర విజయానికి దోహదపడ్డాయి. కలెక్షన్ల పరంగా ఈ చిత్రం రికార్డులు బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేస్తోంది.

మెగా బాండింగ్
పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా జనసేన పార్టీని స్థాపించినప్పటికీ తన అన్న చిరంజీవితో, అయన ఫ్యామిలీతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. కుటుంబ పరంగా ఎలాంటి విభేదాలు లేవు అనే సంకేతాలని పవన్ అభిమానులకు ఇస్తున్నారు. ఇటీవల రాంచరణ్ పుట్టిన రోజు వేడుకల్లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే.

రంగస్థలం చిత్ర యూనిట్ కు అభినందనలు
రంగస్థలం చిత్రం విడుదలయ్యాక పవన్ కళ్యాణ్ పీకే క్రియేటివ్ వర్క్స్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేసారు. చిత్రం విజయం సాధించడంతో రాంచరణ్, సుకుమార్, రంగస్థలం చిత్ర యూనిట్ ని అభినందించారు.

సతీసమేతంగా పవన్.. రాంచరణ్, ఉపాసనతో కలసి
సోమవారం రాంచరణ్ రంగస్థలం చిత్రం ఐమాక్స్ లో వీక్షించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవా, రాంచరణ్, ఉపాసనతో కలసి వెళదాం విశేషం. పవన్ కళ్యాణ్ కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక షోకు రంగస్థలం నిర్మాత, దర్శకుడు సుకుమార్ హాజరు అయ్యారు.

తొలిప్రేమ తరువాత
రంగస్థలం చిత్రం చూసాక పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. తాను తొలిప్రేమ చిత్రం తరువాత థియేటర్ కు వచ్చి చూసిన చిత్రం ఇదే అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

సుకుమార్, చరణ్ అద్భుతంగా
రాంచరణ్ అద్భుతంగా నటించాడని పవన్ ప్రశంసించాడు. నిర్మాత నవీన్ గొప్ప చిత్రాన్ని తీసారని అన్నారు. దర్శకుడు సుకుమార్ గొప్ప కథ, అద్భుతమైన స్క్రీన్ ప్లే తో అదరగొట్టారని పవన్ కితాబిచ్చారు. రంగస్థలం చిత్రం తన మనసుకు విపరీతంగా నచ్చిందని పవన్ తెలిపారు. వాస్తవానికి దగ్గరగా ఉండే కథ ఇది పవన్ మీడియాతో అన్నారు.

ఫాన్స్ పండగచేసుకునే న్యూస్
చివర్లో పవన్ మాట్లాడుతూ ఫాన్స్ పండగచేసుకునే విషయాన్ని వెల్లడించారు. రంగస్థలం చిత్రం గురించి మిగిలిన విషయాలన్నీ తాను సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడతానని పవన్ కళ్యాణ్ తెలపడం విశేషం. అంటే రంగస్థలం సక్సెస్ ఈవెంట్ జరగబోతున్న విషయం, తాను ముఖ్య అతిధిగా రాబోతున్నా విషయం పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు. నిజంగానే ఇది మెగా ఫాన్స్ పండగ చేసుకునే విషయం అని చెప్పొచ్చు.

రికార్డులు తిరగరాస్తున్న రంగస్థలం
రంగస్థలం చిత్రం మెగా పవర్ స్టార్ రాంచరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 100 కోట్ల షేర్ వైపు దూసుకుని పోతోంది. రెండవ వారంలో కూడా ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లు సాధిస్తుండడం విశేషం.


Click it and Unblock the Notifications











