twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా ఎఫెక్ట్.. క్వారంటైన్‌లో పవన్ కళ్యాణ్.. ఆందోళనలో అందరూ అలా!

    |

    ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని కరోనా కుదిపేస్తోంది. చాపకింద నీరులా అందరికీ కరోనా కట్టిపడేస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్, అల్లు అరవింద్, నివేదా థామస్ వంటి వారికి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం అందరూ కరోనా నుంచి కోలుకున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కూడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్వారంటైన్‌కు పరిమితమయ్యారు. ఈ క్రమంలో ఓ ప్రెస్ నోట్ విడుదల చేశాడు.

    హాట్ హాట్‌గా నభా నటేష్.. లేటేస్ట్ ఫోటో షూట్ వైరల్

     వ్యక్తిగత సిబ్బందికి కరోనా..

    వ్యక్తిగత సిబ్బందికి కరోనా..

    'జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ ముఖ్య కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలోని ఎక్కువ మంది కరోనా బారినపడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా వైద్యుల సూచనతో ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు.

    టెలి కాన్ఫరెన్స్‌లో..

    టెలి కాన్ఫరెన్స్‌లో..


    గతవారం రోజులుగా ఆయన పరివారంలోని ఒక్కొక్కరూ కరోనా బారినపడుతూ వస్తున్నారు. వీరంతా ఆయనకు చాలా సమీపంగా విధులు నిర్వహిస్తారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా, కరోనా విస్తృతి నివారణలో భాగంగా ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. రోజువారీ విధులు నిర్వహిస్తూనే పార్టీ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

    అందరూ షాక్..

    అందరూ షాక్..

    ఇక పవన్ కళ్యాణ్ క్వారంటైన్‌లోకి వెళ్లడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. ఇటీవలె సినీ రాజకీయ ఈవెంట్లలో పవన్ కళ్యాణ్ దుమ్ములేపాడు. అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఇండస్ట్రీలోనూ అందరూ ఆందోళనలో ఉన్నారు.

    Recommended Video

    Vakeel Saab Day 1 Collections Report | ఈ వారం చాలా కీలకం !
    సినిమాలకు బ్రేక్..

    సినిమాలకు బ్రేక్..

    అలా పవన్ కళ్యాణ్ క్వారంటైన్‌లోకి వెళ్లడంతో రానాతో రాబోతోన్న మూవీ షూటింగ్ కొన్ని రోజులు క్యాన్సిల్ కానున్నట్టు తెలుస్తోంది. అలాగే క్రిష్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు షూటింగ్‌కు సైతం బ్రేక్‌లు పడ్డట్టు తెలుస్తోంది. ఇక వకీల్‌సాబ్ సినిమాకు వచ్చే ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని పవన్ సూచించినట్టు ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు చెప్పిన సంగతి తెలిసిందే.

    English summary
    Pawan kalyan went To quarantine Due To Corona effect
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X