పవన్ తో ఇలియానాకి మంచి క్రేజ్ ఇచ్చే లవ్ ఆజ్ కల్...!?
వైవియస్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన 'దేవదాసు" చిత్రంతో వెండితెరకు పరిచయమైంది ఇలియానా. ఆ తర్వాత మహేష్ నటించిన 'పోకిరి", యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'రాఖీ" వంటి స్ట్రయిట్ చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. కాగా అభిషేక్ బచ్చన్, రాణీముఖర్జీ హీరోహీరోయిన్ గా నటించిన 'బంటి ఔర్ బబ్లీ" చిత్రం ఆధారంగా తెలుగులో పునర్ నిర్మితమైన చిత్రం 'భలేదొంగలు". ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఇలియానాకు అంతగాకలిసి రాలేదు. ఇలియానా నటించిన తొలి రీమేక్ చిత్రం 'భలేదొంగలు" కావటం విశేషం. ఇక ఈ చిత్రం తర్వాత ఈమె రీమేక్ చిత్రాల్లో నటించలేదు. అయితే ఇప్పుడు మాత్రం మళ్ళీ ఓ రీమేక్ చిత్రంలో నటిస్తోంది ఇలియానా. హిందీలో సూపర్‌డూపర్ హిట్ అయిన 'లవ్ ఆజ్ కల్" చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు జయంత్.
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందిస్తున్న ఈ ఈ చిత్రాన్ని నెక్ట్స్ వీక్ లో కాశీలో స్టార్ట్ అవుతుందని సమాచారం. ఆతర్వాత పాటియాల, అమతసర్, పూనె, ఇటలీ మరియు అమెరికాలలో షూటింగ్ జరుగుతుందని సమాచారం. గణేష్ బాబు నిర్మిస్తున్న తెలుగులోకి రీమేక్ అవుతున్న ఈ చిత్రంలో హీరోగా పవర్‌కళ్యాణ్ నటిస్తుంటే అతనికి జంటగా ఇలియానా నటిస్తోంది. సో...ఈ చిత్రమైనా ఇలియానాకు కలిసొస్తుందో లేదో...వేచి చూడాల్సిందే? ఇంకా కృతి కర్బందా సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ నటిస్తోన్న ఈ చిత్రం హిందీలో ఎంత గొప్ప రెస్పాన్స్ వచ్చిందో తెలుగులో కూడా అంతే రెస్పాన్స్ వస్తుందని ఆశిద్దాం...


Click it and Unblock the Notifications











