ఐఐటి టాపర్ కోరిక తీరుస్తున్న పవన్

By Srikanya

ఐఐటి-జెఇఇ 2011 పరీక్షలలో, ఆలిండియా 1వ ర్యాంక్‌ సాధించిన ఐ.పృధ్వీ తేజ గుర్తుండే ఉంటారు. అతను తన ఇంటర్వూలో తాను పవన్ కళ్యాణ్ కి డైహార్డ్ ఫ్యాన్ ని అని చెప్పుకొచ్చారు. అంతేకాక తను అతన్ని కలవాలనేది తన కోరిక అని వెళ్లడించారు. ఇప్పుడా కోరిక పంజా ఆడియో ఫంక్షన్ వేదికపై తీరనుంది. పేపర్లో పృధ్వీ తేజ చెప్పిన మాటలు చదవిన పవన్ కళ్యాణ్ తాను పృద్వీని అప్పట్లోనే కలవాలని ఉందని, ఏర్పాటు చేయమని తన వాళ్ళకు చెప్పమని పురమాయించారు. అయితే అది మెటీరియలైజ్ కాలేదు. అయితే తాజాగా పంజాలో చేస్తున్న అంజలి.. పవన్ ని ఈ విషయమై ప్రస్దావించినట్లు ట్విట్టర్ లో తెలియచేసింది. తాను పవన్ సార్ ని పృధ్వీ గురించి అడిగానని అయితే తను అతనితో టచ్ లోకి రాలేకపోయినట్లు పవన్ చెప్పారని ట్వీట్ చేసింది. అయితే పంజా నిర్మాతలు దీన్ని సుసాధ్యం చేయటానికి ప్రయత్నించారు.

వారు వెంటనే రంగంలోకి దిగి తన ట్విట్టర్ లో పృధ్వీ తేజ నెంబర్ కావాలంటూ ట్వీట్ చేసారు. ఓ గంటలోనే రెస్పాన్స్ వచ్చింది. వెంటనే అతనికి ఫోన్ చేసి 19న జరగనున్న ఆడియో ఫంక్షన్ లో అతన్ని కలవటానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయటం జరిగిందని సమాచారం. ఆ రోజే ఐఐటి టాపర్ కోరిక పవన్ తీర్చనున్నారు. ఇక పంజా ఆడియో కోసం, సినిమా రిలీజ్ కోసం అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పంజాకి చెందిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ అందరిలో క్యూరియాసిటిని పెంచాయి. తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ రూపొందించిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కి ఖుషి లాంటి విజయాన్ని అందిస్తుందని చెప్పుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X