రేణు దేశాయ్ పెళ్లి గురించి పవన్ ట్వీట్.. 'రేణు గారు' అంటూ శుభాకాంక్షలు, ఊహించని విధంగా!

Recommended Video

Pawan Kalyan Tweets About Renu Desai Second Marriage

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కలయిక చాలా ఆసక్తికరం. బద్రి చిత్రంతో తొలిసారి కలుసుకున్న వీరిద్దరూ ఆ తరువాత సహజీవనం, వైవాహిక జీవితంతో ఒక్కటయ్యారు. ఆతరువాత వీరిద్దరూ విడిపోవడం, పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకోవడం తెలిసిన సంగతే. ఇదిలా ఉండగా పవన్ నుంచి విడిపోయాక రేణు దేశాయ్ తన పిల్లతో పుణేలో నివాసం ఉంటోంది. రేణు దేశాయ్ మరో వివాహం చేసుకోవాలని భావించింది. ఇటీవలే ఆమె నిచ్చితార్ధం కూడా జరిగింది. వరుడి వివరాలని రేణు గోప్యంగా ఉంచింది. రెండవ వివాహంతో కొత్త జీవితం ప్రారంభిస్తున్న రేణు దేశాయ్ కు పవన్ కళ్యాణ్ ఎవరూ ఊహించని విధంగా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

బద్రి చిత్రంతో తొలిసారి

బద్రి చిత్రంతో తొలిసారి

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బద్రి చిత్రంలో పవన్, రేణు దేశాయ్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతోనే వీరి పరిచయం మొదలైంది. ఆ తరువాత ప్రేమగా మారింది. జానీ చిత్రంలోనూ ఈ జంట కలసినటించింది.

సహజీవనం

సహజీవనం

ప్రేమ చిగురించిన తరువాత పవన్, రేణు కలసి కొన్నేళ్ల పాటు సహజీవనం చేశారు. అకిరా జన్మించాక వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కావడం విశేషం. అనుకోని కారణాలతో వీరిద్దరో 2012 లో విడిపోయారు.

పుణేలో రేణు

పుణేలో రేణు

ఆ తరువాత రేణు దేశాయ్ తన పిల్లలతో పూణే వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవాని వివాహం చేసుకున్నాడు.

పెళ్లి ఆలోచన

పెళ్లి ఆలోచన

రేణు దేశాయ్ కూడా మరో వివాహం చేసుకునే ఆలోచనని ఆ మద్యన బయటపెట్టింది. ఇటీవల సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చే పట్టుకుని ఉన్న ఫోటోని పోస్ట్ చేయడం, చివరి వరకు ఈ చేతిని వదిలి పట్టకు అని మెసేజ్ పెట్టడంతో రేణు త్వరలో వివాహం చేసుకోబోతోంది అనిఅంతా భావించారు.

 అనుకున్నట్లుగానే

అనుకున్నట్లుగానే


అంతా అనుకున్నట్లుగానే ఇటీవల రేణుదేశాయ్ నిశ్చితార్థం జరిగింది. కొద్దిమంది బంధు మిత్రుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.తన నిచితార్థ విషయాన్ని రేణు దేశాయ్ స్వయంగా సోషల్ మీడియాలో ధృవీకరించింది.

పవన్ కళ్యాణ్ ట్వీట్

ఎవరూ ఊహించని విధంగా రేణు దేశాయ్ రెండవ వివాహం గురించి పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో స్పందించారు. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

రేణు గారు అని సంభోదిస్తూ

రేణు గారు అని సంభోదిస్తూ

రేణుగారు అంటూ పవన్ కళ్యాణ్ సంభోదించాడు. కొత్త జీవితంలో శాంతి సంతోషాలు నెలకొనాలని పవన్ రేణు దేశాయ్ ని విష్ చేయడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X