స్టార్ దర్శకుడి పుట్టినరోజున పవన్ కళ్యాణ్ స్పెషల్ మీటింగ్.. మరో లుక్ వైరల్
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి దర్శకుడైన సరే అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ తో వర్క్ చేయాలని ఒక ఆలోచిస్తాడు.. మాస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న టాప్ హీరోల్లో పవన్ ఒకరు. అలాంటి హీరోకు తగ్గట్లు కథ సెట్ చేయాలి అంటే అతన్ని మనసుతో ఇష్టపడాలి. అలా అయితేనే బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ దక్కుతుంది. ఇక హరీష్ శంకర్ కూడా పవన్ ను ఎంతగా ఇష్టపడతారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

అప్పుడే అర్ధమయ్యింది
హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా గబ్బర్ సింగ్. అసలైతే వీరిద్దరి కాంబోలో మిరపకాయ్ రావాల్సింది. కానీ ఆ ప్రాజెక్ట్ అనుకోకుండా రవితేజ వద్దకు వెళ్లింది. అయితే పవన్ కు పర్సనల్ గా కనెక్ట్ అయితే పెద్దగా అనుభవం లేకపోయినా కూడా యువ దర్శకులను ఛాన్స్ ఇస్తుంటారని అప్పుడే అర్ధమయ్యింది.

పవన్ కోసం హరీష్ న్యూ ప్లాన్
గబ్బర్ సింగ్ సినిమా నుంచి ఒకటైన ఈ స్టార్ కాంబో మరోసారి సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. PSPK28 ప్రాజెక్టు కోసం కథ కూడా ఆల్ మోస్ట్ సెట్టయినట్లే అని టాక్ వస్తోంది. అయితే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయిన తరువాతే సినిమాను సెట్స్ పైకి తేవాలని హరీష్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

దర్శకుడితో మీటింగ్
ఇక చాలా రోజుల తరువాత హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ ఫొటోకి స్టిల్ ఇచ్చారు. ఎందుకంటే నేడు హరీష్ శంకర్ పుట్టినరోజు కావడంతో పవన్ కళ్యాణ్ స్పెషల్ గా కలుసుకొని తన విషెస్ అందించారు. అందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరో బాక్సాఫీస్ హిట్ వచ్చినట్లే అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఆ రెండు సినిమాల తరువాతే
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ హరిహర వీరమల్లు సినిమాతో రెడీ అవుతున్న విషయం తెలిసిందే. హిస్టారికల్ పీరియడ్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. అలాగే మలయాళం హిట్ మూవీ అయ్యప్పనుమ్ కొశీయుమ్ షూటింగ్ ను కూడా పూర్తి చేస్తున్నారు. ఈ రెండు సినిమాల అనంతరం పవన్ హరీష్ సినిమా సెట్స్ పైకి రానుంది.


Click it and Unblock the Notifications











