»   » సర్దార్ గబ్బర్ సింగ్: అలీ బుజాల మీద ఎక్కిన పవన్ (ఫోటో)

సర్దార్ గబ్బర్ సింగ్: అలీ బుజాల మీద ఎక్కిన పవన్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్‌కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా సెట్స్ నుండి కొన్ని ఫోటోలు విడుదలైంది. బైక్ మీద అలీ...అలీ మీద గబ్బర్ సింగ్...... చూడటానికి ఈ ఫోటో ఆసక్తికరంగా ఉంది. సినిమా ప్రమోషన్లో భాగంగానే ఈ ఫోటో రిలీజ్ చేసారు. పవన్ కళ్యాణ్ తన కో స్టార్స్ తో చాలా ఫ్రెండ్లీగా ఉంటారనే సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ సినిమాలో అలీ తప్పకుండా ఉంటారు. పవన్ కళ్యాణ్ ఎప్పటి నుండో ఈ సెంటిమెంట్ కొనసాగిస్తున్నారు. అలీ తన సినిమాలో లేకపోతే ఏదో తెలియని వెలితిగా ఫీలవుతానని, అతను పక్కనుంటే ధైర్యంగా వుంటుందని గతంలో పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే.

కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.... పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. పవనకల్యాణ్‌ సరసన కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. పవనకల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైనమెంట్‌ ప్రై.లి, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి నేతృత్వంలో రూ.5 కోట్ల వ్యయంతో వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ సెట్ ఒక ఏరియాలా ఉంటుందని టాక్. 20 రోజులపాటు ఇక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. తెలుగు సినిమా చరిత్రలో భాగా ఖర్చు పెట్టిన సెట్లలో ఇదీ ఒకటిగా పేర్కొంటున్నారు.

తాజాగా ఈ సినిమాలో మరో హాట్ బ్యూటీకి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. బెంగుళూరు బ్యూటీ సంజన కూడా ఈ సినిమాలో ఓ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఆమె సినిమాలో సంజన్ పాత్ర ఎలా ఉండబోతోంది? అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం రావడంతో ఫుల్ హ్యాపీగా ఉందట సంజన.

స్లైడ్ షోలోఫోటోస్...

రిలీజ్

రిలీజ్


ఏప్రిల్ 8, 2016లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారం. సమ్మర్ ట్రీట్ గా ఈ చిత్రం అలరించనుందని,అప్పుడైతే వేసవి శెలవలు కలిసి వస్తాయని టీమ్ భావిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

లక్ష్మీరాచ్

లక్ష్మీరాచ్


రాయ్ లక్ష్మీ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రతో పాటు స్పెషల్ సాంగుతో ప్రేక్షకులను అలరించనుంది.

కాజల్

కాజల్


పవనకల్యాణ్‌ సరసన కాజల్‌ కథానాయికగా నటిస్తోంది.

సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్


కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.... పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

English summary
Power Star Pawan Kalyan is enjoying shooting for his maiden production venture Sardaar Gabbar Singh. In the above working still, the actor is seen chilling out with the film's prominent cast such as Ali, Brahmaji, Raghubabu and Narra Srinivas.
Please Wait while comments are loading...