‘ఎవడు’ వేడుకలో పవన్ గురించి చిరంజీవి

By Srikanya

హైదరాబాద్ : రామ్‌చరణ్, శ్రుతిహాసన్, అమీజాక్సన్ హీరో హీరోయిన్లుగా అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ అతిథి పాత్రల్లో రూపొందిన చిత్రం 'ఎవడు'. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'దిల్' రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. సోమవారం రాత్రి జరిగిన ఈ చిత్రం ఆడియో వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సీడీని చిరంజీవి ఆవిష్కరించి రామ్‌చరణ్, అల్లు అర్జున్‌కి ఇచ్చారు. అప్పుడు మెగా ఫ్యాన్స్ అంతా పవన్ కళ్యాణ్ గురించి అడిగారు.

అప్పుడు చిరంజీవి ... పవన్‌కళ్యాణ్‌ని అడుగుతున్న అభిమానులను ఉద్దేశించి, ఈ చిత్రం సిల్వర్ జూబ్లి వేడుకల్లో పాల్గొంటాడని అన్నారు. ఈ సినిమా జూబ్లీ వేడుకలు పవన్‌కల్యాణ్‌ లేకుండా జరగవు అని హామీ ఇచ్చారు. దాంతో ఒక్కసారిగా హర్షధ్వానాలు మిన్నంటాయి. ఈ వేడకకు పవన్ వస్తారని అంతా ఆశించారు. అయితే అలా జరగకపోవటంతో నిరాశచెందారు ఫ్యాన్స్.

ఇక చిరంజీవి మాట్లాడుతూ ...ఇటీవలే 'ఎవడు' రషెస్‌ చూశాను. ఆద్యంతం ఉత్కంఠతో నిలబెట్టేసింది. మగధీరకి దీటుగా ఉంటుందీ చిత్రం. మగధీర తరవాత అంతటి చిత్రం చరణ్‌కు చాలా తొందరగా వచ్చింది. ఈ సినిమా జూబ్లీ వేడుకలు పవన్‌కల్యాణ్‌ లేకుండా జరగవు. ఈ సినిమా గురించి అభిమానులు ఎంత ఊహించుకున్నా ఫర్వాలేదు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం... ఆ పాటల్లోని కిక్‌ నా చేతా డ్యాన్స్‌ చేయించింది. ఇంట్లో విన్నాను.. నా మనవరాలితో కలిసి డ్యాన్స్‌ చేశాను అన్నారు.

అలాగే మగధీరలో షేర్‌ఖాన్‌ శ్రీహరిలా... ఇందులో ధర్మగా సాయికుమార్‌ కనిపిస్తారు. తండ్రికి తగ్గ తనయ అనిపించుకొంది శ్రుతిహాసన్‌. చరణ్‌ మీ అందరికీ నచ్చేలా ఉంటాడు. చాలా అందంగా కనిపించాడు. పాత్రకు అన్ని విధాలుగా సరిపోయాడు. అర్జున్‌ది అయిదు నిమిషాల పాత్రే అయినా గుర్తుండిపోతాడు. సినిమా టీజర్‌ చూశాను... చరణ్‌ చాలా మాస్‌ హీరోగా కనిపించాడు. నా అభిమానులకు సామాజిక బాధ్యత ఉంది. ఇతరుల చిత్రాలు చూసి వాళ్లను తక్కువ చేస్తూ మాట్లాడరు. హుందాగా ఉంటారు. ఆ స్థాయిని వాళ్లు నిలబెట్టుకొంటున్నారు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X