పవన్ స్లిమ్ లుక్ : 20ల్లో, ఇప్పుడు తేడా! (ఫోటో)
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాబోయే సినిమా 'అత్తారింటికి దారేది', 'గబ్బర్ సింగ్ -2' చిత్రాలో స్లిమ్ లుక్‌తో కనిపించబోతున్నారు. ఆయన 20ల్లో ఎలా ఉన్నారో....ఇప్పుడు అలా కనిపించబోతున్నారు. ఇటీవల ఆయన షూటింగ్ స్పాట్లో దిగిన ఫోటో ఒకటి ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తోంది. అందులో పవన్ స్లిమ్ లుక్‌తో ఆకట్టుకుంటున్నారు.
పవర్ స్టార్ 20ల్లోని ఫోటో, ఇప్పటి ఫోటో పక్కపక్కనే పెట్టి తేడా చూస్తే పవర్ స్టార్లో పెద్దగా మార్పు లేదని స్పష్టం అవుతోంది. దీన్ని బట్టి తన రాబోయే సినిమాల్లో ఆయన యువకుడి లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారన్నమాట. ఇటీవల పవర్ స్టార్ బెంగుళూరులోని ఓ ఫిట్ నెస్ సెంటర్లో ప్రత్యక్షమయ్యారు. బాడీ ఫిట్ నెస్ విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనడానికి ఇదే సాక్ష్యం.
ప్రస్తుతం పవన్ కళ్యాన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అత్తారింటికి దారేది' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. సమంత, ప్రణీత ఈ చిత్రంలో హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈచిత్రం తర్వాత 'గబ్బర్ సింగ్ -2' చిత్రం తెరకెక్కనుంది.
'గబ్బర్ సింగ్ -2' చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించనున్నారు. పవన్ స్నేహితుడు శరత్ మరార్ ఈచిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన హీరోయిన్, ఇతర తారాగణం విషయాలు వెల్లడికానున్నాయి. ఐపీఎల్ యాంకర్ రాచెల్లే రావుతో ఇందులో ఐటం సాంగు చేయిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











