ఆమె పవన్ కళ్యాణ్ రెండో కూతురేనా? (ఫోటో)
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన ఏ విషయమైనా ఇపుడు సెన్నేషనే. ఎందుకంటే ఆయనకు సంబంధించిన పర్స విషయాలు బయటి ప్రపంచానికి అంతగా తెలియదు. అందుకే అభిమానులు అలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉంటారెప్పుడూ. తాజాగా పవన్ కళ్యాణ్ ఒడిలో బేబీ ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. ఆమె పవన్ కళ్యాణ్ రెండో కూతురని అనుకుంటున్నారంతా!

పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే..
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల' చిత్రంలో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో పాటు వెంకటేష్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. హిందీ చిత్రం ‘ఓ మై గాడ్'కు రీమేక్ ఇది. డాలీ దర్శకత్వం వహిస్తున్నారు. డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్ నిర్మాతలు. సురేశ్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
విక్టరీ వెంకటేష్, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్‌గా నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్ర నిర్మాణంలో ఎక్కడ తగ్గకుండా సినిమాను తీశామని నిర్మాతలు డి.సురేష్‌బాబు, శరత్‌మారార్‌లు తెలిపారు. డాలి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Click it and Unblock the Notifications