Bro The Avatar Trailer బ్రో ట్రైలర్ రికార్డుల మోత.. ఫాస్టెస్ట్‌గా మిలియన్ల వ్యూస్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న బ్రో చిత్రం ట్రైలర్ రికార్డుల వేట మొదలుపెట్టింది. నటుడు సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూలై 28వ తేదీన రిలీజవుతున్న నేపథ్యంలో ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని దేవీ థియేటర్‌లో ఆవిష్కరించారు. ఈ ట్రైలర్ ఆవిష్కరణ భారీగా తరలి వచ్చిన అభిమానుల చేతుల మీదుగా జరిగింది. ఈ ట్రైలర్ ఆవిష్కరణ వివరాల్లోకి వెళితే..
జూలై 28న రిలీజవుతున్న బ్రో సినిమాలో టైటిల్ పాత్రధారి (Bro)గా పవన్ కళ్యాణ్, మార్క్ అకా మార్కండేయులుగా సాయి ధరమ్ కనిపిస్తున్నారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, సముద్రఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, పృధ్వీ రాజ్, నర్రా శ్రీను, యువలక్ష్మి, దేవిక, అలీ రెజా, సూర్య శ్రీనివాస్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రాఫర్‌గా, తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

బ్రో ది అవతార్ సినిమా ట్రైలర్‌ను ఆంధ్ర, నైజాంలో రిలీజ్ చేశారు. వైజాగ్‌లోని జగదాంబ థియేటర్‌లో, హైదరాబాద్‌లో దేవీ థియేటర్‌లో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ వైజాగ్ వేడుకలో సాయిధరమ్ తేజ్, టీజీ విశ్వప్రసాద్ పాల్గొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు సముద్రఖని, హీరోయిన్ కేతికా శర్మ, నిర్మాతలు వివేక్ కూచిభోట్ల, నిమ్మకాయల ప్రసాద్ పాల్గొన్నారు.
హైదరాబాద్ దేవీ థియేటర్ లో జరిగిన వేడుకలో సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. బ్రో చాలా మంచి సినిమా. సినిమా భారీ సక్సెస్ పట్ల చాలా నమ్మకంగా ఉన్నాం. మీరు దేవుడిగా భావించే పవన్ కళ్యాణ్ గారు దేవుడిగా నటించిన సినిమా ఇది. ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది అని అన్నారు.

బ్రో (Bro The Avatar) సినిమా కోసం అందరిలాగే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, కుటుంబంతో కలిసి థియేటర్ కి వెళ్లి ఆనందించదగ్గ చిత్రం అని హీరోయిన్ కేతిక శర్మ అన్నారు.
బ్రో మూవీ ట్రైలర్ కేవలం శాంపిల్ మాత్రమే. సినిమాలో ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు అని సంగీత దర్శకుడు థమన్ అన్నారు.
వైజాగ్ జగదాంబ థియేటర్‌లో జరిగిన వేడుకలో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. మీ ప్రేమ పొందటం కోసమే ఇంత దూరం వచ్చాను. మీ అందరికీ ట్రైలర్ నచ్చడం సంతోషంగా ఉంది. రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అభిమానులకి ఏమైనా జరిగితే మేం తట్టుకోలేము అని అన్నారు. అలాగే నాకు కొంచెం తిక్కుంది.. దానికి లెక్కుంది అంటూ తన మేనమామ పవన్ కళ్యాణ్ ఫేమస్ డైలాగ్ చెప్పి అభిమానుల్లో ఉత్సాహం నింపారు.

బ్రో మూవీ ట్రైలర్ మిమ్మల్ని ఎంతగా అలరించిందో, దానికి వంద రెట్లు సినిమా అలరిస్తుంది అని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ అన్నారు.
ఇదిలా ఉండగా, బ్రో మూవీ ట్రైలర్ విడుదలైన 30 నిమిషాల్లో దాదాపు 2 మిలియన్ల రియల్ టైమ్ వ్యూస్ సాధించింది. అతి తక్కువ కాలంలో అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్ల జాబితాలో చేరింది.


Click it and Unblock the Notifications











