ఏపీలో OG టికెట్ రేట్ల పెంపు.. పవన్ కల్యాణ్ మూవీ బెన్‌ఫిట్ షో టికెట్ ధర ఎంతంటే?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా RRR లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన టాప్ ప్రొడక్షన్ కంపెనీ డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మాతగా సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఓజీ (OG) గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ, సంగీతం థమన్ ఎస్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైంది. ఈ సినిమా కోసం ప్రత్యేక షోలు, బెన్‌ఫిట్ షోలకు, టికెట్ల పెంపుపై ఏపీ ప్రభుత్వం అధికారికంగా జీవోను జారీ చేసింది. ఆ జీవోలో సర్కార్ ఏం చెప్పిందంటే..
పవన్ కల్యాణ్, సుజిత్ కాంబినేషన్‌లో వస్తున్న ఓజీ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్లు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారానికి భిన్నంగా ప్రీమియర్లకు అనుమతి ఇవ్వకుండా ఏపీ సర్కార్ జాగ్రత్తలు తీసుకొన్నది. అయితే అర్ధరాత్రి 1 గంటకు బెన్‌ఫిట్ షోకు అనుమతి ఇచ్చింది. అయితే బెనిఫిట్ షో కోసం టికెట్‌ను 1000 రూపాయలుగా (జీఎస్టీతో కలిపి) ధరను నిర్ణయిస్తూ జీవోలో పేర్కొన్నది.
ఇక ఈ సినిమా కోసం టికెట్ రేట్లను భారీగా పెంచేందుకు అనుమతి ఇచ్చింది. సింిల్ థియేటర్‌లో టికెట్‌పై 125 రూపాయలు (జీఎస్టీతో కలిపి) పెంచుకొనే విధంగా, అలాగే మల్టీప్లెక్స్ థియేటర్‌లో టికెట్‌పై 150 రూపాయలు (జీఎస్టీతో కలిపి) పెంచుకొనే విధంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలని జిల్లా కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు, పోలీస్ శాఖకు, సినిమాటోగ్రఫి శాఖ అధికారులకు జీవోలో పేర్కొన్నది.


Click it and Unblock the Notifications











