’పవన్ కల్యాణ్‌ను ఛాలెంజ్ చేసి ఓడిపోయా.. అందుకు మూల్యం చెల్లించుకొంటున్నా‘

గోదావరి జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన విజయాన్ని దక్కించుకొన్నారు. అయితే ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్టు ఆయన ప్రకటించగానే వైసీపీ నేతలు, ముఖ్యంగా కాపు నేత ముద్రగడ పద్మానాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఓడించి తీరుతామని శపథం చేశారు. ఒకవేళ తాము ఓడిపోతే పేరు మార్చుకొంటానని సవాల్ విసిరారు. ఆయితే తాను ప్రకటించినట్టుగానే పేరు మార్చుకొంటానని వీడియో రిలీజ్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువా కప్పుకొన్న ముద్రగడ పద్మనాభం జనసేనపై విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీకి తొత్తుగా మారారని పవన్‌పై భారీ కామెంట్స్ చేశారు. అయితే పిఠాపురంలో ఓటమి తప్పదని తేల్చేశారు. పవన్ ఓడించకపోతే పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకొంటానని చెప్పారు.

Pawan Kalyan s Pithapuram Winnig Effect Mudragada Padmanabham name to be changed as Mudragada Padmanabha Reddy

అయితే పిఠాపురంలో ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే ముద్రగడ పద్మానాభంను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేశారు. అంతేకాకుండా నామకరణోత్సవం అంటూ ఆహ్వాన పత్రికను కూడా ప్రింట్ చేసి వాట్సప్‌లో విస్త‌ృతంగా ప్రచారం చేశారు. దాంతో ముద్రగడ పద్మానాభం స్పందించాల్సి వచ్చింది.

పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించి పంపుతామని సవాల్ చేశాను. ఆయనను ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకొంటానని ఛాలెంజ్ చేశాను. ఒకవేళ పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరును ముద్రగడ పద్మనాభం అని కాకుండా పద్మనాభరెడ్డిగా మార్చుకొంటానని శపథం చేశాను. ప్రస్తుతం ఓటమి చెందాను. చెప్పినట్టుగా నా పేరును పద్మనాభరెడ్డిగా మార్చేలా గెజిట్ పేపర్లు తయారు చేసుకొన్నాను అని పద్మనాభం అన్నారు.

Pawan Kalyan s Pithapuram Winnig Effect Mudragada Padmanabham name to be changed as Mudragada Padmanabha Reddy

నేను ఛాలెంజ్ విసినట్టుగానే నా పేరు మార్పు కోసం గెజిట్ డాక్యుమెంట్లు రెడీ అయ్యాయి. వాటిని పూర్తి చేసి నా పేరును మార్చాలని గెజిట్‌ రిలీజ్ చేస్తాను. గెజిట్ పబ్లిష్ చేయడానికి తగిన చర్యలు తీసుకొంటాను అని పద్మనాభం అన్నారు.

Pawan Kalyan s Pithapuram Winnig Effect Mudragada Padmanabham name to be changed as Mudragada Padmanabha Reddy

అయితే పద్మనాభం ముద్రగడ స్పందించిన తీరుపై జనసేన నేతలు, పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశమైంది. గెలుపు తర్వాత ఎవరిపై వ్యక్తిగత కక్షలు ఉండవని చెప్పిన పవన్.. పేరు మార్పు వ్యవహారంపై ఎలా స్పందిస్తారు? ఏదైనా కామెంట్ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X