BRO థియేటర్‌లో Junior PowerStar Akira సందడి.. మూవీ రివ్యూ ఏం ఇచ్చాడంటే?
పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి థియేటర్లలో సందడి చేస్తున్నాడు. ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్టు టాక్ తో దూసుకుపోతుంది. ఇక తండ్రి సినిమా చూసేందుకు అకీరా నందన్ కూడా థియేటర్ కు వెళ్లాడు. ఇక ఇప్పుడు ఈ వీడియోను ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తూ.. 'జూనియర్ పవర్ స్టార్ ' అని పోస్ట్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...
పాజిటివ్ టాక్ తో... :పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన మల్టీ స్టారర్ మూవీ బ్రో. ఈరోజు జులై 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సూపర్ హిట్ టాక్ తో ఈ మూవీ దూసుకుపోతుంది. సముద్ర ఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపూల్ మీడియా ఫ్యాక్టర్ బ్యానర్ మీద తెరకెక్కింది. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్మతలుగా వ్యవహారించగా.. జీ స్టూడియోస్ సమర్పిస్తోంది.

మార్పులు చేర్పులు.. :తమిళంలో తెరకెక్కి సూపర్ హిట్టుగా నిలిచిన వినోదయ సిత్తం సినిమాను... తెలుగు నెటివిటీగా తగ్గట్లుగా మార్పులు, చేర్పులు చేసి రూపొందించారు. ఇక తమిళ ఒరిజినల్ మూవీ డైరెక్ట్ చేసిన సముద్రకని.. తెలుగులోనూ ఆయన దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్.. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించగా.. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించాడు. హీరోయిన్లుగా కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ నటించారు.

జూనియర్ పవర్ స్టార్... :అయితే మొదటి షో నుంచి బ్రోకు మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక అటు మెగా ఫ్యాన్స్ కే కాకుండా.. అందరికీ ఈ మూవీ పునకాలు తెప్పిస్తోంది. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. సినీ ప్రముఖులు సైతం సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ కూడా బ్రో సినిమా చూసేందుకు థియేటర్ కు వచ్చాడు. బ్రో సినిమా చూసేందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ని సుదర్శన్ థియేటర్ కు వెళ్లాడు. ఇక ఇప్పుడు ఈ వీడియోను ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తూ.. 'జూనియర్ పవర్ స్టార్ ' అని పోస్ట్ చేస్తున్నారు.అంతేకాదు అకిరా బ్రో సినిమాపై పాజిటివ్ గా కామెంట్ చేసినట్లు తెలుస్తుంది.

టాలీవుడ్ ఎంట్రీ... :పవన్ కల్యాణ్, రేణుదేశాయ్ విడిపోయిన సంగతి తెలిసిందే. వీరి కుమారుడే అకీరానందన్. ఇక మెగా ఫ్యామిలీ ఫంక్షన్లలో అప్పుడప్పుడు మెరిసే ఈ కుర్రాడు.. ఇప్పుడు తండ్రి సినిమా చూసేందుకు థియేటర్ కు వచ్చాడు. ఇక అకీరాను చూసి ఫ్యాన్స్ అయితే తెగ సంబుర పడిపోతున్నారు. ఎప్పుడెప్పుడు సినీ తెరంగేట్రం చేస్తాడా అని ఫ్యాన్స్ అయితే ఎదురుచూస్తున్నారు. మరి అకీరాకు సినిమా రంగంలో ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు.
సూపర్ హిట్ టాక్.. :ఇక బ్రో సినిమా విషయానికి వస్తే... ఈ సినిమా పాజిటివ్ బజ్ తో దూసుకుపోతుంది. మొదటిరోజు బుకింగ్స్ ఓ రేంజులో అయినట్లు సమాచారం. 'బ్రో' సినిమాలో పవన్ కల్యాణ్ టైమ్ అనే మోడ్రన్ గాడ్ పాత్రలో కనువిందు చేశారు. సాయితేజ్ మార్క్ అనే పాత్రలో నటించారు. ఈ మామాఅల్లుళ్లతో పాటు హీరోయిన్లుగా కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ నటించారు. బ్రహ్మనందం సహా పలువురు నటులు ఇతర కీలక పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











