రిలీజ్‌కు ముందే ‘వకీల్ సాబ్’ మూవీ రికార్డు: గతంలో ఏ సినిమాకూ లేని విధంగా.. పవన్‌కే సాధ్యమైంది

మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సినిమాల్లోకి ప్రవేశించి.. అద్భుతమైన టాలెంట్‌తో తనలోని సత్తాను తెలుగు ప్రేక్షకులకు చూపించాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ క్రమంలోనే ఆరంభంలో భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు. తద్వారా స్టార్ హీరోగా గుర్తింపుతో పాటు కొన్ని కోట్ల మంది అభిమానాన్ని అందుకున్నాడు. అంతటి ప్రభావం ఉన్న హీరో.. చాలా కాలం తర్వాత 'వకీల్ సాబ్' సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇంకేముందు ఈ చిత్రం రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేసేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆ వివరాలు మీకోసం!

రీఎంట్రీ కోసం సాహసం.. ‘వకీల్ సాబ్'గా మారాడు

రీఎంట్రీ కోసం సాహసం.. ‘వకీల్ సాబ్'గా మారాడు

చాలా గ్యాప్ తర్వాత 'వకీల్ సాబ్' అనే సినిమాతో కమ్‌బ్యాక్ అవుతున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించాడు. రీఎంట్రీ అంటే కొత్త కథతో వచ్చే పరిస్థితులు ఉన్నా.. పాత సినిమాను రీమేక్ చేస్తున్నాడు పవన్.

ఆ ముగ్గురిదే అసలు కథ.. పోరాటం చేసే లాయర్

ఆ ముగ్గురిదే అసలు కథ.. పోరాటం చేసే లాయర్

మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలకు అనుకోని విధంగా ఓ కష్టం వస్తుంది. ఇందులో భాగంగానే వాళ్లంతా ఓ కేసులో ఇరుక్కుంటారు. వాళ్లకు ప్రతికూలంగా మారుతోన్న టైమ్‌లో లాయరైన హీరో ఎంట్రీ ఇస్తాడు. అప్పటి నుంచి బాధిత యువతలను కాపాడేందుకు పోరాటం చేస్తాడు. ఇదే వకీల్ సాబ్ కథ. అంజలి, నివేదా థామస్, అనన్య ఆ మూడు పాత్రలను చేశారు.

రెండింటి కంటే భిన్నంగా.. అందుకే భారీ రెస్పాన్స్

రెండింటి కంటే భిన్నంగా.. అందుకే భారీ రెస్పాన్స్

'వకీల్ సాబ్' ప్రకటించినప్పటి నుంచే దీనిపై ఆసక్తి ఏర్పడింది. రెండు భాషల్లో లేని విధంగా ఇందులో పవన్ కల్యాణ్‌ పాత్రను ఎలివేట్ చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే మోషన్ పోస్టర్, ఆ తర్వాత వచ్చిన సినిమాలోని పాటలతో అవన్నీ రెట్టింపయ్యాయి. ఇక, సంక్రాంతికి వచ్చిన టీజర్‌ దీనిపై మరింత ప్రభావాన్ని చూపించింది.

భారీగా అంచనాలు.. అందుకు తగ్గట్లుగా బిజినెస్

భారీగా అంచనాలు.. అందుకు తగ్గట్లుగా బిజినెస్

లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ నటించిన సినిమా కావడంతో 'వకీల్ సాబ్'పై భారీ బజ్ ఏర్పడింది. దీని కోసం మెగా అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు అనుగుణంగానే డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీ మొత్తం పెట్టి దీన్ని కొనుగోలు చేశారు. దీంతో అన్ని ఏరియాల్లో కలిపి ఈ మూవీ రూ. 100 కోట్లకు పైగానే బిజినెస్ చేసింది.

ట్రైలర్‌తో సంచలనం.. చరిత్ర సృష్టించిన వకీల్ సాబ్

ట్రైలర్‌తో సంచలనం.. చరిత్ర సృష్టించిన వకీల్ సాబ్

'వకీల్ సాబ్' మూవీ ట్రైలర్ సోమవారం సాయంత్రం విడుదలైన విషయం తెలిసిందే. అద్భుతమైన కట్స్‌తో ఆకట్టుకున్న దీనికి.. అన్ని వర్గాల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. తద్వారా 24 గంటల్లోనే 18 మిలియన్లకు పైగా వ్యూస్.. 1 మిలియన్‌కు పైగా లైక్స్ సాధించింది. ఫలితంగా ఈ వీడియో వల్ల ఎన్నో రికార్డులు సైతం బద్దలైపోయాయి. దీనిపై పవన్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

విడుదలకు ముందే ‘వకీల్ సాబ్' మూవీ రికార్డులు

విడుదలకు ముందే ‘వకీల్ సాబ్' మూవీ రికార్డులు

పవన్ కల్యాణ్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే 'వకీల్ సాబ్' సినిమాకు అప్పుడే మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోతున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పటికే 92 శాతం థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టేశారు. ఇది టాలీవుడ్‌లో ఓ రికార్డు. అలాగే, మిగిలిన ప్రాంతాల్లో సైతం ఓపెన్ అయిన గంటల వ్యవధిలోనే టికెట్లు అయిపోవడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X