Just In
- 18 min ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 1 hr ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 9 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
- 11 hrs ago
అభిమాని పెళ్లిలో సడన్‌గా ప్రత్యక్షమైన స్టార్ హీరో.. అతిధులంతా షాక్!
Don't Miss!
- News
కుటుంబమంతా నగ్నంగా పూజలు.. మృతదేహంపై ముగ్గు వేసి... మదనపల్లె కేసులో భయంకర నిజాలు
- Automobiles
ఎలక్ట్రిక్ కారుగా మారిన మారుతి డిజైర్ ; వివరాలు
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రిలీజ్‌కు ముందే రికార్డులు తిరగరాస్తున్న వకీల్ సాబ్.. సౌత్‌లో సూపర్ స్ట్రాంగ్‌గా పవర్ స్టార్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్‌సాబ్ రిలీజ్‌కు ముందే సంచలనాలను నమోదు చేస్తున్నది. కరోనా లాక్‌డౌన్ సమయంలో కూడా అత్యధికంగా ట్వీట్ చేసిన తెలుగు చిత్రంగా వకీల్ సాబ్ ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ రికార్డుకు సంబంధించిన వివరాలు ఇవే..

సౌత్‌లో రెండోస్థానంలో
దక్షిణాది చిత్రాల్లో చూసుకొంటే.. నంబర్ 1 స్థానంలో విజయ్ నటించిన మాస్టర్ చిత్రం ఉంటే.. రెండో స్థానంలో పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ ఉంది. మూడోస్థానంలో అజిత్ నటిస్తున్న వలిమై, అలాగే నాలుగోస్థానంలో మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట, నంబర్ 5లో సూరారైపొట్రూ చిత్రం, రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ నటించిన RRR ఉంది.

7వ స్థానంలో అల్లు అర్జున్
ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప 7వ స్థానంలో, మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు 8వ స్థానంలో కేజీఆఫ్2, దర్బార్ చిత్రాలు 9, 10 స్థానాలను ఆక్రమించాయి. అయితే 2020లో అత్యధికంగా ట్వీట్ చేసిన టాప్ 10 చిత్రాల్లో మహేష్ బాబుకు సంబంధించిన రెండు సినిమాలు ఉండటం గమనార్హం.

పవన్ కల్యాణ్ స్టామినా అంటే అదే..
తెలుగులో మాత్రం పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం అత్యధికంగా ట్వీట్ చేసిన చిత్రంగా నిలవడంతో పవన్ కల్యాణ్ స్టామినా మరోసారి స్పష్టమైంది. ఈ చిత్రం హిందీ, తమిళంలో ఘన విజయం సాధించిన పింక్ చిత్రం ఆధారంగా రూపొందిన సంగతి తెలిసిందే.

మూడేళ్ల గ్యాప్ తర్వాత
పవన్ కల్యాణ్ కెరీర్ విషయానికి వస్తే.. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ టాలీవుడ్‌లో నటిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్, మే మాసంలో రిలీజ్ కావాల్సింది. కానీ కరోనావైరస్ కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఏప్రిల్ లేదా మే 2021లో ఈ చిత్రం విడుదల కానున్నది.