‘వకీల్ సాబ్’కు మరో బిగ్ షాక్: అప్పుడే టీవీలో ప్రసారం.. అందుకోసమే వాళ్లు కుట్ర చేశారా అంటూ!

సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అందుకు అనుగుణంగానే మూడేళ్ల తర్వాత అతడు 'వకీల్ సాబ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. అదే సమయంలో కలెక్షన్లతో బాక్సాఫీస్‌పై పవర్ స్టార్ దండయాత్ర కూడా చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో టికెట్ రేట్ల తగ్గింపు, షోలు క్యాన్సిల్ చేయడం వంటి షాకులు తగిలాయి. ఈ క్రమంలోనే 'వకీల్ సాబ్' చిత్రానికి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

పవన్ కల్యాణ్.. వకీల్ సాబ్‌గా మారాడిలా

పవన్ కల్యాణ్.. వకీల్ సాబ్‌గా మారాడిలా

చాలా గ్యాప్ తర్వాత 'వకీల్ సాబ్'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు పవన్ కల్యాణ్. ఆడవాళ్ల సమస్యలపై తీసిన ఈ సినిమాను వేణు శ్రీరామ్ రూపొందించాడు. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటించగా.. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రలు చేశారు. థమన్ సంగీతం అందించాడు. ఇది 'పింక్'కు రీమేక్‌గా వచ్చింది.

బికినీలో కిమ్ శర్మ హంగామా.. లేటు వయసులో కూడా తగ్గని అందాల వాడి

భారీ రెస్పాన్స్... ఆరు రోజుల్లోనే అదిరేలా

భారీ రెస్పాన్స్... ఆరు రోజుల్లోనే అదిరేలా

భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 9న 'వకీల్ సాబ్' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి అన్ని ప్రాంతాల్లోనూ అద్భుతమైన స్పందన వచ్చింది. తద్వారా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో పాటు భారీ స్థాయిలో ఓపెనింగ్స్‌ దక్కాయి. ఫలితంగా ఈ సినిమా కలెక్షన్లను కూడా అదే రీతిలో దక్కించుకుంది. ఇక, ఆరు రోజుల్లోనే దాదాపు రూ. 75 కోట్లు వసూలు చేసింది.

జాన్వీ కపూర్ బ్యూటిఫుల్ పిక్స్.. లాక్‌డౌన్‌లో అలా రోడ్డుపై కనిపించిన బ్యూటీ

ఏపీ ప్రభుత్వం నుంచి వరుస షాకులతో

ఏపీ ప్రభుత్వం నుంచి వరుస షాకులతో

ఆరంభం నుంచే 'వకీల్ సాబ్' చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వరుసగా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఈ సినిమా బెనిఫిట్, స్పెషల్ షోలు రద్దు చేసిన జగన్ సర్కారు.. ఆ వెంటనే టికెట్ రేట్లను తగ్గించాలని కొత్త జీవోను తీసుకొచ్చింది. దీంతో పవన్ కల్యాణ్ సినిమా కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడిపోయింది. ఈ ఇష్యూ కోర్టు వరకూ వెళ్లడంతో పెద్ద వివాదంగా మారిపోయింది.

మూతబడుతోన్న ‘వకీల్ సాబ్' థియేటర్లు

మూతబడుతోన్న ‘వకీల్ సాబ్' థియేటర్లు

టికెట్ రేట్లను తగ్గించాలని కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో స్వల్ప ధరలనే ఫిక్స్ చేయాల్సి వచ్చింది. దీంతో ఆ టికెట్ రేట్లతో థియేటర్లు నడిపేందుకు చాలా మంది యజమానులు వెనకడుగు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ఏరియాల్లో సినిమా హాళ్లు మూతబడ్డాయి. కొన్ని చోట్ల 'వకీల్ సాబ్' ప్రదర్శనను నిలిపి వేసేశారు కూడా.

‘వకీల్ సాబ్' సినిమాకు మరో బిగ్ షాక్

‘వకీల్ సాబ్' సినిమాకు మరో బిగ్ షాక్

ఇప్పటికే బెనిఫిట్ షోలు రద్దు చేయడం.. టికెట్లు రేట్లు తగ్గించడం.. థియేటర్లు మూతబడడం వంటి వాటి వల్ల 'వకీల్ సాబ్'కు కోలుకోలేని ఎదురు దెబ్బలు తగిలాయి. ఈ ప్రభావం మూవీ కలెక్షన్ల మీద విపరీతంగా ప్రభావాన్ని చూపుతోంది. మరీ ముఖ్యంగా చాలా ఏరియాల్లో తక్కువగా వసూలు చేస్తోంది. ఇలాంటి సమయంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు మరో బిగ్ షాక్ తగిలింది.

అప్పుడే టీవీలో ప్రసారం చేసిన ఆపరేటర్

అప్పుడే టీవీలో ప్రసారం చేసిన ఆపరేటర్

పైరసీని ప్రోత్సహించే కొన్ని సైట్లు 'వకీల్ సాబ్' ఫుల్ మూవీ డౌన్‌లోడ్ లింక్‌ను రిలీజ్ రోజునే ఆన్‌లైన్‌లో పెట్టేశాయి. వాటన్నింటిలోనూ ఈ మూవీ థియేటర్ ప్రింట్ దర్శనమిచ్చింది. ఇక, అదే రోజు ఈ సినిమాను విజయనగరం జిల్లాలోని ఓ కేబుల్ టీవీలో ప్రసారం చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో కేబుల్ ఆపరేటర్‌పై కొందరు కంప్లైట్ ఇచ్చారని తాజాగా తెలిసింది.

Recommended Video

#VakeelSaab : Vakeel Saab Movie Team Ugadi Special Interview Part 4 | Pawan Kalyan | Venu Sriram
అందుకోసమే వాళ్లు కుట్ర చేశారా అంటూ

అందుకోసమే వాళ్లు కుట్ర చేశారా అంటూ

'వకీల్ సాబ్' చిత్రాన్ని కేబుల్ టీవీలో ప్రసారం చేయడంపై పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే దిల్ రాజు పంపిన లింక్‌పై సోషల్ మీడియా వేదికగా రిపోర్టు చేసినట్లు తెలిసింది. ఇక, ఈ సినిమాను రాజకీయ కక్షతోనే ప్రసారం చేశారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, మూవీని చంపాలనే ఉద్దేశంతోనే ఇలా కుట్ర చేశారని దీనిపై పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X