‘వకీల్ సాబ్’ మరో రికార్డు: మొదటి రోజు కలెక్షన్ల అంచనా.. టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించే దిశగా పవన్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. కానీ, వాటిలో కొన్నింటికి మాత్రమే అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తూ ఉంటుంది. అలాంటిది మూడేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అయితే.. ఆ ప్రభావం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు పది రోజులుగా రెండు రాష్ట్రాలు 'వకీల్ సాబ్' మేనియాతో ఊగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ సినిమా రిలీజ్ సమయంలోనే అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అంతేకాదు, ఫస్ట్ డే పవన్ కల్యాణ్ చరిత్ర సృష్టించే దిశగా సాగుతున్నాడు. ఆ వివరాలు మీకోసం!

‘వకీల్ సాబ్'గా కమ్ బ్యాక్ అవుతోన్న పవన్

‘వకీల్ సాబ్'గా కమ్ బ్యాక్ అవుతోన్న పవన్

రాజకీయాల కోసం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పవన్ కల్యాణ్.. 'వకీల్ సాబ్'తో రీఎంట్రీ ఇస్తున్నాడు. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను వేణు శ్రీరామ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ కాగా.. అంజలి, నివేదా థామస్, అనన్యలు కీలక పాత్రలు చేశారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం ఇచ్చాడు.

పవన్ కోసమే కొత్తగా.... వాటికే ఫ్యాన్స్ ఫిదా

పవన్ కోసమే కొత్తగా.... వాటికే ఫ్యాన్స్ ఫిదా

'వకీల్ సాబ్' మూవీలో అనుకోని విధంగా ఓ కేసులో చిక్కుకున్న ముగ్గురు యువతులను కాపాడే లాయర్ పాత్రను పోషిస్తున్నాడు పవన్ కల్యాణ్. ఇప్పటికే ఈ సినిమా బాలీవుడ్‌లో 'పింక్' అని, తమిళంలో 'నెర్కొండ పార్వాయి' అనే పేర్లతో వచ్చింది. రెండు చోట్లా లేని విధంగా తెలుగులో హీరో పాత్రను ఎలివేట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌తో అది అర్థం అయిపోయింది.

పండుగ వాతావరణం.. అన్ని చోట్లా కళకళగా

పండుగ వాతావరణం.. అన్ని చోట్లా కళకళగా

తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే ఏ రేంజ్ హడావిడి ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే, మూడేళ్ల గ్యాప్ తర్వాత ఆయన సినిమా రిలీజ్ కాబోతుండడంతో ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ పండుగ వాతావరణం నెలకొంది. అన్ని చోట్లా థియేటర్లు మూడు రోజుల ముందు నుంచే కళకళలాడుతున్నాయి. సోషల్ మీడియాలో సైతం వకీల్ సాబ్ ట్రెండ్ అవుతూనే ఉంది.

ఫ్యాన్స్ దూకుడు.. ఎంతకైనా వెనుకాడట్లేదు

ఫ్యాన్స్ దూకుడు.. ఎంతకైనా వెనుకాడట్లేదు

తమ అభిమాన హీరో పవన్ కల్యాణ్ సినిమా 'వకీల్ సాబ్' విడుదల అవుతుండడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, రిలీజ్‌కు ముందు నుంచే స్పెషల్ షోలు వేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడడం లేదు. టికెట్ ధరలను పట్టించుకోవడం లేదు. దీంతో పవన్ రేంజ్‌ను చాటుతున్నారు.

విడుదల విషయంలో ‘వకీల్ సాబ్' రికార్డుతో

విడుదల విషయంలో ‘వకీల్ సాబ్' రికార్డుతో

'వకీల్ సాబ్' మూవీ నైజాంలో 354, సీడెడ్‌లో 220, ఆంధ్రాలో 600, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 300, ఓవర్సీస్‌లో 700లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా 2174 థియేటర్లలో విడుదల అవుతుంది. తద్వారా టాలీవుడ్‌లో భారీ స్థాయిలో రిలీజ్ అయిన చిత్రాల జాబితాలో 9వ స్థానానికి చేరింది. ఇక, లాక్‌డౌన్ తర్వాత విడుదలవుతోన్న మొట్టమొదటి భారీ చిత్రంగా రికార్డు సాధించింది.

మొదటి రోజు ‘వకీల్ సాబ్' కలెక్షన్ల అంచనా

మొదటి రోజు ‘వకీల్ సాబ్' కలెక్షన్ల అంచనా

గత ఏడాది సంక్రాంతికి తర్వాత బడా స్టార్ సినిమాలు విడుదల కాలేదు. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అది కూడా భారీ సంఖ్యలో ప్రదర్శన కాబోతుంది. దీంతో మొదటి రోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 32 -35 కోట్లు వసూలు అయ్యే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించే దిశగా పవన్

టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించే దిశగా పవన్

గతంలో 'బాహుబలి 2' మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 43 కోట్లు వసూలు చేసింది. నాన్ బాహుబలి కేటగిరీలో 'సైరా: నరసింహారెడ్డి' రూ. 38.75 కోట్లు రాబట్టింది. ఇక, నాన్ పాన్ ఇండియా చిత్రాల జాబితాలో 'సరిలేరు నీకెవ్వరు' రూ. 32.77 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడీ రికార్డును 'వకీల్ సాబ్' దాటే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే టాలీవుడ్‌లో పవన్ సరికొత్త చరిత్ర స‌‌ృష్టిస్తాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X