‘వకీల్ సాబ్’ టికెట్ రేట్ల వివరాలు లీక్: పెద్దలకు ఒకలా.. పిల్లలకు మరోలా.. అక్కడ భారీగా పెంచేశారు
తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు ప్రప్రథమంగా చెప్పుకోవచ్చు. దాదాపు రెండు దశాబ్ధాలుగా టాలీవుడ్‌లో తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తున్నాడతను. అందుకే ఈ మెగా హీరో సినిమా కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో వేచి చూస్తుంటారు. అలాంటిది సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇస్తుంటే.. ఆ చిత్రానికి ఎలాంటి క్రేజ్ ఉంటుందో 'వకీల్ సాబ్' హడావిడి చూసి అర్థం చేసుకోవచ్చు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో టికెట్ రేట్ల వివరాలు లీకయ్యాయి. ఆ సంగతులు మీకోసం!

‘వకీల్ సాబ్'గా రీఎంట్రీ ఇస్తున్న పవన్ కల్యాణ్
సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు పవన్ కల్యాణ్. 'పింక్'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను వేణు శ్రీరామ్ రూపొందించాడు. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించాడు. ఇందులో పవన్.. లాయర్‌గా నటించిన విషయం తెలిసిందే.
కీర్తీ సురేష్ బ్యూటీఫుల్ గ్యాలరీ.. రంగ దేతో మరో సక్సెస్ అందుకొన్న మహానటి

సినిమా కాన్సెప్టు ఇదే... రెండు భాషల్లో వాళ్లు
బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ హీరోగా వచ్చిన చిత్రమే 'పింక్'. దీన్ని తమిళంలో అజిత్ కుమార్ 'నెర్కొండ పార్వాయి' పేరిట రీమేక్ చేశాడు. ఇప్పుడిదే కథతో పవన్ కల్యాన్ 'వకీల్ సాబ్' అనే మూవీ చేశాడు. మధ్య తరగతికి చెందిన ముగ్గురు అమ్మాయిలు అనుకోకుండా ఓ కేసులో చిక్కుకుంటారు. వాళ్లను కాపాడేందుకు లాయరైన హీరో చేసిన ప్రయత్నమే ఈ సినిమా కథ.
నాభి ప్రదర్శనతో శ్రద్దా దాస్ అందాల ఆరబోత.. క్రేజీ ఫోటోషూట్ వైరల్...

పవన్ ఇమేజ్‌కు తగ్గట్లు.. అన్నింటికీ భారీగానే
'వకీల్ సాబ్' ప్రకటించినప్పటి నుంచే దీనిపై ఆసక్తి ఏర్పడింది. రెండు భాషల్లో లేని విధంగా ఇందులో పవన్ కల్యాణ్ పాత్రను ఎలివేట్ చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే మోషన్ పోస్టర్, ఆ తర్వాత వచ్చిన సినిమాలోని పాటలతో అవన్నీ రెట్టింపయ్యాయి. ఇక, సంక్రాంతికి వచ్చిన టీజర్ దీనిపై మరింత ప్రభావాన్ని చూపించింది.
దిశాపటానీ బోల్డ్ ఫోటోలు.. ముంబై ఎయిర్‌పోర్టులో స్మార్ట్‌గా

రికార్డు స్థాయిలో బిజినెస్.. కెరీర్‌లోనే తొలిసారి
లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ నటించిన సినిమా కావడంతో 'వకీల్ సాబ్'పై భారీ బజ్ ఏర్పడింది. దీని కోసం మెగా అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు అనుగుణంగానే డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీ మొత్తం పెట్టి దీన్ని కొనుగోలు చేశారు. దీంతో అన్ని ఏరియాల్లో కలిపి ఈ మూవీ రూ. 100 కోట్లకు పైగానే బిజినెస్ చేసింది.
లంగా ఓణిలో పాయల్ రాధాకృష్ణ.. యువ తార లవ్లీ ఫోటోషూట్...

ఫుల్ జోష్‌లో అభిమానులు.. రికార్డులు బద్దలు
'వకీల్ సాబ్' మూవీ ట్రైలర్ సోమవారం సాయంత్రం విడుదలైన విషయం తెలిసిందే. అద్భుతమైన కట్స్‌తో ఆకట్టుకున్న దీనికి.. అన్ని వర్గాల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. తద్వారా 24 గంటల్లోనే 18 మిలియన్లకు పైగా వ్యూస్.. 1 మిలియన్‌కు పైగా లైక్స్ సాధించింది. ఫలితంగా ఈ వీడియో వల్ల ఎన్నో రికార్డులు సైతం బద్దలైపోయాయి. దీనిపై పవన్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

‘వకీల్ సాబ్' టికెట్ ధరల వివరాలు బయటకు
'వకీల్ సాబ్' మూవీపై భారీ స్థాయిలో ఆసక్తి ఉంది. ఇందులో భాగంగానే ఈ సినిమా కోసం అందరూ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు థియేటర్ యాజమాన్యాలు టికెట్ ధరలను భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. అన్ని ప్రాంతాల్లోనూ బెన్‌ఫిట్ షోలకు రూ. 1000 - 2000 వరకూ టికెట్ రేట్లు ఫిక్స్ చేశారని టాక్.

పెద్దలకు ఒకలా.. పిల్లలకు మరోలా.. అక్కడలా
యూఎస్‌లో ఏప్రిల్ 8నే 265కి పైగా లొకేషన్స్‌లో 'వకీల్ సాబ్' ప్రీమియర్స్ పడనున్నాయి. వీటికి పెద్దలకు 14 డాలర్లు, పిల్లలకు 10 డాలర్లుగా టికెట్ రేట్లు ఫిక్స్ చేశారు. ఆ తర్వాత నుంచి పెద్దలకు 12 డాలర్లు, పిల్లలకు 9 డాలర్లుగా నిర్ణయించారు. ఇక, ఆంధ్రాలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మొదటి మూడు రోజులు రూ. 300.. ఆ తర్వాత నుంచి రూ. 150 - 200 వసూలు చేస్తారట.


Click it and Unblock the Notifications











