For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ టాపిక్ : పవన్ చాలా రిలాక్స్ గా... (ఫొటో)

  By Srikanya
  |

  హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ రిలాక్స్ గా వెనక్కి జారి కూర్చున్న ఫోటో ఇప్పుడు అంతటా హల్ చల్ చేస్తోంది. దగ్గుపాటి రానా చెల్లెలు వివాహంకు హాజరైన పవన్ అక్కడ ఇలా కనిపించి ఫొటో గ్రాఫర్స్ కు చిక్కారు. డిసెంబర్ 5 న ఈ వివాహం జరిగింది. వెంకటేష్ శ్రీకాంత్,రామ్ చరణ్ ల ప్రక్కన పవన్ ఇలా కూర్చుని ఉన్నారు. పవన్ సాధారణంగా బయిటకు రారు. దాంతో ఆయన స్పెషల్ ఎట్రాక్షన్ గా మారారు. ఈ ఫోటో పవన్ అభిమానులకు చాలా కూల్ గా పండుగ చేసుకునేలా ఉంది.

  ఇక పవన్ కళ్యాణ్ త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో 'సరదా'(తాత్కాలిక టైటిల్) చిత్రం చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే లాంచనంగా పూజా కార్యక్రమం జరుపుకున్న ఈచిత్రం త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ తమ చిత్రం కోసం అద్భుతమైన లొకేషన్లు వెతకడంలో భాగంగా యూరఫ్ ఖండంలోని స్పెయిన్ లో పర్యటిస్తున్నారు.

  ఎక్కువ భాగం చిత్రీకరణ స్పెయిన్‌లోనే సాగుతుంది. అక్కడ దాదాపు 30 -45 రోజులపాటు షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే హీరో, దర్శకుడు కలిసి లొకేషన్ల వేటలో ఉన్నారు. పవన్ ఇలా లొకేషన్స్ సెర్చ్ చేయటానికి వెళ్లటం తొలిసారి. డిసెంబర్ చివరి వారంలో వెనక్కి తిరిగి వస్తారు. ఆ తర్వాత ఈ నెల చివరి వారంలో కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ చిత్రీకరణ ప్రారంభమవుతుంది.

  ఈ చిత్రం ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సంగీతానికి ప్రత్యేక స్ధానం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంపై పవన్ ప్రత్యేక శ్రద్ద కనపరుస్తున్నారు. అందుకే ఆయనే స్వయంగా లొకేషన్స్ ఎంపికకు బయిలుదేరారు. ఈ వెతుకులాటలో తాజాగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా జాయిన్ అయ్యాడు. పనిలో పనిగా దేవిశ్రీ ఇక్కడే ఈ ఇద్దరితో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ వేయనున్నారు. ఈ సినిమా కోసం తను ప్రిపేర్ చేసుకున్న ట్యూన్లు వారికి వినిపించనున్నాడు.

  ఈ చిత్రానికి 'హరే రామ హరే కృష్ణ', 'సరదా' టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ మాత్రం ఈచిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదని, నేను చెప్పే వరకు ఏ వార్తను నమ్మ వద్దని ఇటీవల ఓ ఇంట్వర్యూలో తేల్చి చెప్పారు. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో జల్సా సినిమా వచ్చింది. జల్సా కలెక్షన్ల జల్లు కురిపించింది. దీంతో త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్‌కు సమంత తోడు కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు.

  English summary
  Recently, Pawan Kalyan graced the wedding of Daggubati Rana's Sister Malavika on December 5th. He was seen sitting beside Venkatesh, Ram Charan and Srikanth at the venue. The cameras have turned towards him to capture this lazy pose of the Numero Uno Star.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X