అవి రూమర్స్ అంటూ పవన్ లేఖ

By Srikanya

హైదరాబాద్: పవన్ ఎప్పటికప్పుడు తనపైన,తన పార్టీపైన వచ్చిన రూమర్స్ కొట్టిపారేస్తూ తన అభిమానులకు,తనతో కలిసి ప్రయాణం చేసే వారికి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోనున్నారంటూ వచ్చిన వార్తలు రూమర్స్ అని కొట్టిపారేసేతూ బీజేపీ సీమాంధ్ర నాయకుడు సోము వీర్రాజుకు లేఖ పంపినట్లు సమాచారం. ఆదివారం సాయింత్రం ఈ లేఖ పంపినట్లు తెలుస్తోంది. నరేంద్ర మోడీతో పవన్ భేటీకి వీర్రాజు మధ్యవర్తిగా వ్యవహరించారు.

ఆ లేఖలో...తెలుగుదేశంతో సహా ఏ ప్రాంతీయ పార్టీకి మద్దతు ఇవ్వాలని నేను ఈ రోజు వరకూ నిర్ణయించుకోలేదు. లేనిపోని పుకార్లు వస్తున్న నేపధ్యంలో నేనీ విషయాన్ని స్పష్టం చేస్తున్నాను . జనసన, మోడీ మధ్య సత్సంబంధాలు పొంపొందాలని,అవి మరింత పటిష్టం కావాలని మాత్రమే ఆకాంక్షిస్తున్నా అని రాసినట్లు తెలుస్తోంది. ఈ లేఖను ఆయన పొత్తు వ్యవహారాలు చూస్తున్న అరుణ్ జైట్లీకు పంపారని చెప్తున్నారు.

Pawan Letter to Bjp Leader

ఇక దేశానికి నరేంద్రమోడీ వంటి బలమైన ప్రధానమంత్రి అవసరం ఎంతో ఉందని జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, సినీహీరో పవన్‌కల్యాణ్‌ చెప్పారు. మోడీకి, ఆయన పార్టీ భాజపాకు తాము మద్దతిస్తామని ప్రకటించారు. తనకు పదవులకన్నా తెలుగు ప్రజల సంక్షేమమే ముఖ్యమని పునరుద్ఘాటించారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసేది, లేనిదీ త్వరలో ప్రకటిస్తానన్నారు. పవన్‌కల్యాణ్‌ మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే...

''కేంద్రప్రభుత్వానికి సారథ్యం వహించిన కాంగ్రెస్‌ వూగిసలాట ధోరణి కారణంగా దేశానికి ఎంతో నష్టం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగిన తీరే దానికి మంచి ఉదాహరణ. నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా ఉండిఉంటే అలా జరిగేది కాదు. దేశానికి మోడీ వంటి గట్టి ప్రధానమంత్రి అవసరం. ఆయనకు నా తరఫున, నా పార్టీ తరఫున మద్దతు తెలపటానికి వచ్చాను. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య భవిష్యత్తులో తలెత్తే సమస్యలు, వాటి పరిష్కారాల గురించి మోడీతో చర్చించాను. ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీకి, ఆయన పార్టీ భాజపాకు మద్దతిస్తాను. నేను రాజకీయ నాయకుడిని కాను. అధికారంలోకి రావాలని, పదవులను చేపట్టాలని నాకు లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X