భాగ్యనగరంలో పులి, ఖలేజా, బృందావనం ల గోల గోల...
ఓ స్టార్ హీరో సినిమా స్టార్ట్ అవుతుందంటే చాలు..ఆ సినిమాలో ఏమేం వుండాలో సదరు దర్శక నిర్మాతల దగ్గర తమ కోరికల చిట్టా విప్పేసే అభిమానులు ఆ సినిమా రిలీజ్ కి వచ్చేసరికి ఈ థియేటర్స్ లోనే వెయ్యాలంటూ పంతం పడుతూ వుంటారు. అఫ్ కోర్స్..ప్రీవియస్ ఫలితాల మేరకు వాళ్ళకుండే సెంటిమెంట్స్ వాళ్ళకుంటాయి మరి. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ 'పులి", మహేష్ 'ఖలేజా", ఎన్టీఆర్ 'బృందావనం" చిత్రాలు స్వల్స వ్యవధిలోనే విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పుడు మరోసారి థియేటర్ల డిమాండ్స్ మొదలెట్టారు అభిమానులు. అది ముఖ్యంగా హైదరాబాద్ లో.
భాగ్యనగరంలో పవన్ కి బాగా కలిసొచ్చిన థియేటర్ సంధ్య 70కాగా, తొలిప్రేమ, ఖుషీ, జల్సా, వంటి హింట్స్ పడ్డ ఆ థియేటర్ లోనే 'కొమరం పులి" నీ దింపాలన్న అభిమానుల కోరిక మేరకు ఆల్ రెడీ ఆగస్ట్ 11కి ఆ థియేటర్స్ ని బుక్ చేసేశారు. అలాగే మహేష్ కి మురారి, ఒక్కడు, పోకిరి వంటి హిట్స్ దక్కిన సుదర్శన్ 35ని 'ఖలేజా" కోసం కాంట్రాక్ట్ కి తీసేసుకోవడమూ జరిగిపోయిందట. ఇక జూ ఎన్టీఆర్ 'బృందావనం" కోసం 'ఆది" థియేటర్ దేవిని సిద్దం చేస్తున్నారు దిల్ రాజు. అన్నట్టు ఈ తంతు ఇక్కడే కాదండోయ్ అన్ని ప్రధాన నగరాల్లోనూ జరుగుతోంది..ఎక్కడికక్కడ థియేటర్ల పంపకాలతో ఎగ్జిబిటర్ల సర్కిల్ యమా వేడెక్కుతోంది.


Click it and Unblock the Notifications











